మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతి | - | Sakshi
Sakshi News home page

మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతి

Feb 28 2026 7:30 AM | Updated on Feb 28 2026 7:30 AM

మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతి

మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతి

కాగజ్‌నగర్‌టౌన్‌: మాలీ కులస్తులను ఎస్టీ జా బితాలో చేర్చాలని మాలీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురె శ్యాంరావు శుక్రవారం పట్టణంలో ఎమ్మెల్సీ దండె విఠల్‌కు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడు తూ రాష్ట్రంలోని మాలీలకు ఎస్టీ హోదా కల్పించాలని 40 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ని వారికి ఎస్టీ హోదా కల్పించగా, తెలంగాణ లో మాత్రం బీసీలో కొనసాగడంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ హోదా కల్పించేలా పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ ఎంపీలతో కేంద్రం ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో మాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు షెండె వాసు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదె వసంత్‌, నాయకులు గంగారాం, రాందేవ్‌, గోపాల్‌, శ్రీనివాస్‌, బాబురావు, వి జయ్‌, పాండురంగ, రవి సురేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement