గ్రీవెన్స్ డేలో అందే ఫిర్యాదులు పెండింగ్ ఉండకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్.ఆదేశించారు.
ఆకాశదీపం వెలిగింది..
గుంటు మల్లన్న ఆలయంలో
ప్రారంభించిన కలెక్టర్ దివాకర
ఖమ్మంగాంధీచౌక్: కార్తీక మాసం ఉత్సవాల ప్రారంభ సూచికగా ఖమ్మంలోని శ్రీ గుంటుమల్లేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం ఆకాశదీపం ప్రారంభోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కలెక్టర్ దివాకర టీ.ఎస్. – లావణ్య దంపతులు ప్రత్యేక పూజలు చేశాక అర్చకుల మంత్రోచ్ఛరణలు, భక్తుల శివ నామస్మరణ మధ్య ధ్వజస్తంభంపై ఆకాశదీపాన్ని వెలిగించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మేకల వీరస్వామి, పర్యవేక్షకులు సమత, ఈఓ చుండూరు రామకోటేశ్వరరావు, అర్చకులు దాములూరు కృష్ణశర్మ, దాములూరు వీరభద్రరావు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాగా, దీపాన్ని తాడు సాయంతో పైకి లాగే క్రమాన ఇనుప చువ్వలో తుప్పు కారణంగా మధ్యలో నిలిచిపోగా, నిర్వాహకులు కర్ర సాయంతో వేలాడదీశారు.


