వైరా/ఏన్కూరు: పలు వ్యవసాయ మార్కెట్ల పరిధి చెక్‌పోస్టుల వద్ద పాటు విజిలెన్స్ అధికారులు తనిఖీ చేపట్టారు. పన్ను చెల్లించకుండా పంట ఉత్పత్తులను తరలిస్తున్న వారిని గుర్తించేలా ఏర్పాటు చేసిన బృందంలో అధికారులు నరేషకుమార్, వీరాంజనేయులు, వెంకటేశ్వర్లు, నిర్మల, పృధ్వీ, ఏ.నిర్మల ఉన్నారు. వీరు ఆత్కూరు, వెంకటా పురం, తల్లాడ, ఏన్కూరు, ముత్తగూడెం, ఎర్రుపాలెం, మధిర చెక్‌పోస్టుల వద్ద తనిఖీ చేపట్టారు. ఈమేరకు పన్ను చెల్లించకుండా సరుకు తీసుకెళ్తున్న వాహనదారు లకు జరిమానా విధించారు. అలాగే, లైసెన్స్ లేకుండా పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. ఆత్కూరు చెక్‌పోస్టు వద్ద రూ.19వేలు, వెంకటాపురంలో రూ.36,900, తల్లాడలో రూ.67,335, ఏన్కూరులో 35,157, ముత్తగూడెంలో రూ.55వేలు, ఎర్రుపాలెంలో రూ.వేయి, మఽధిర చెక్‌పోస్టు వద్ద రూ.43,320 జరిమానా విధించినట్లు తెలిపారు.
వాహనాలకు జరిమానా,
వ్యాపారులకు నోటీసులు


