ఖమ్మంరూరల్: ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్ల డించారు. ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఖమ్మం రూరల్ మండలం కామంచికల్‌లో కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌తో కలిసి మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి వారి కుటుంబీకులతో దీపావళి వేడుక జరుపుకున్నారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పేదింటి బిడ్డలతో దీపావళి జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం మొదటి విడతలో 4.50 లక్షలు, రెండో విడతలో 2.50లక్షల ఇళ్లతో పాటు హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు, మొత్తంగా 8లక్షల ఇళ్లను ఆడబిడ్డల పేరిట మంజూరు చేసిందని చెప్పారు. మొదటి విడతలో మంజూరైన ఇళ్లలో ఇప్పటివరకు 2.21లక్షల ఇళ్లు పూర్తికావడంతో లబ్ధిదారులతో కలిసి దీపావళి జరుపుకుంటున్నామని తెలిపారు. పేదలందరికీ ఇళ్లు అందే వరకు ఎన్ని విడతలైనా పథకాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.
కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో..
కూసుమంచి: పేదల ఆత్మగౌరవాన్ని పెంచేలా తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసిన మంత్రి.. కలెక్టర్ దివాకరతో కలిసి బ్ధిదారుల కుటుంబీకులతో దీపావళి జరుపుకున్నారు. లబ్ధిదారుల ఎంపికలో పక్షపాతం, రాజకీయాలు ఉండవని.. జీవన ప్రమాణాలే అర్హతగా పరిగణిస్తామని తెలిపారు. అలాగే, నేలకొండపల్లి మండలం కోరట్లగూడెంలో ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకలకు మంత్రి హాజరయ్యారు. పోలీసు కమిషనర్ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి, ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, సర్పంచ్ త్రివేణి, బానోతు నాగేశ్వరరావు, తహసీల్దార్లు వినయేందర్‌రెడ్డి, సైదులు, ఎంపీడీఓలు రవికుమార్, జశ్వంత్‌కుమార్, నాయకులు బజ్జూరి వెంకటరెడ్డి, బచ్చలకూరి నాగరాజు, వెన్నపూసల సీతారాములు, గోవిందరావు, నెల్లూరి భద్రయ్య, బోయిన వేణు, కట్టెకోల నాగార్జున, కోర్లకుంట్ల నాగేశ్వరరావు, చెరుకుపల్లి రాజేష్, కొమ్మూరి నరేష్, పసుపులేటి ఉపేందర్, కడియాల నరేష్ పాల్గొన్నారు.
‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’లో
మంత్రి పొంగులేటి


