● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ● హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలు : తమ్మినేని వీరభద్రం
నేలకొండపల్లి: కమ్యూనిస్టుల ఐక్యతతోనే రాజకీయ అధికారం సాధ్యమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. నేలకొండపల్లిలో శనివారం మాజీ ఎమ్మెల్యే కర్నాటి కృష్ణయ్య 28వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టులు విడివిడిగా పని చేయడం వల్ల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నామని, వామపక్ష శక్తులన్నీ ఐక్యంగా సాగితే రాజకీయ అధికా రాన్ని సాధించే దిశగా అడుగులు వేయొచ్చని తెలిపా రు. కమ్యూనిస్టుల ఉద్యమం బలోపేతం కావాలంటే పార్టీలు, పరస్పర విభేదాలను పక్కన పెట్టి ఐక్య కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని, చట్టాల్లో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ‘సర్’తో కోట్లాది మంది ఓటు హక్కు కోల్పోవడానికి కారణమైన కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలన్నారు. ఇదే సమయాన ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల హక్కుల సాధన కోసం, వామపక్ష శక్తులు ఐక్యంగా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఇంకా ఈ సభలో మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, వివిధ పార్టీల నాయకులు భాగం హేమంతరావు, మౌలానా, దండి సురేష్, కర్నాటి భానుప్రసాద్, జితేందర్‌రెడ్డి, సీ.వై.పుల్లయ్య, మారిశెట్టి వెంకటేశ్వరరావు, కాశిబోయిన అయోధ్య, మల్లెబోయిన ఉపేందర్, సత్తార్, రాయల మాధవరావు, పాల్తీయ శ్రీనివాసరావు, బి.కృష్ణ, కడియాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
24 గంటల విద్యుత్ ఇవ్వకపోతే ఆందోళనలు
రైతులకు 24గంటల పాటు విద్యుత్ సరఫరా చేయకపోతే ప్రత్యక్ష ఆందోళనలు చేపడుతామని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. నేలకొండపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేవలం 12 గంటలు కాకుండా 24గంటలు విద్యుత్ సరఫరా చేయడంతో పాటు పాలేరు పాత కాల్వ ఆయకట్టు చివరి భూములకు అందే వరకు నీటి సరఫరా చేయాలనఆనరు. కాగా, వచ్చే నెల 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే రైతు సంఘం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, కే.వీ.రెడ్డి, ఏటుకూరి రామారావు, రావెళ్ల సుదర్శన్, రచ్చా నర్సింహారావు, భూ క్యా కృష్ణ, దుగ్గి వెంకటేశ్వర్లు, బెల్లం లక్ష్మి, బలుసు ప్రమీల, దండా సూర్యానారాయణ, మారుతి కొండలరావు మందడపు మురళీకృష్ణ, సిరికొండ నాగేశ్వరరావు, అమరబోయిన బిక్షం, తెల్లమేకల శేషుబాబు, సామాల మల్లికార్జున్‌రావు పాల్గొన్నారు.


