సత్తుపల్లి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకమైనవి.. పది శాతం మంది ఓటర్లు తీర్పు ఇచ్చే ఈ ఎన్నికలు సెమీఫైనల్స్ వంటివని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అధ్యక్షతన శనివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమరెడ్డి విద్యావంతుడే కాక ఆయన కుటుంబం కాంగ్రెస్ కోసం కష్టపడిందన్నారు. ఈమేరకు జిల్లాలో ముగ్గురు శక్తివంతమైన మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఉన్నందున అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించడంపై ప్రతీ కార్యకర్త దృష్టి సారించాలని తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శ్రద్ధతో తల్లాడ, కల్లూరు, పెనుబల్లి మండలానికి గోదావరి జలాలు వచ్చాయని.. వచ్చే నెలలో సత్తుపల్లి, వేంసూరు మండలాలకు కూడా చేరతాయని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చొరవతో రెండో దశలో ఐదు వేల ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. అనంతరం యాతాలకుంట టన్నెల్ పనులను ఎంపీ రఘురాంరెడ్డి ఎమ్మెల్యే రాగమయితో కలిసి పరిశీలించారు. సీతారామ ప్రాజెక్ట్ అధికారులతో సమీక్షించి సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, ఐటీడీఏ పసో రాహుల్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, యాతాలకుంట సర్పంచ్ తాటి ఈశ్వరి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, గాదె చెన్నారావు, దోమా ఆనంద్, ఎం.డీ.కమల్పాసా, చల్లగుళ్ల నరసింహారావు, చల్లగుండ్ల కృష్ణయ్య, దూదిపాల రాంబాబు, మందపాటి ప్రభాకర్రెడ్డి, ఎం.డీ.ఫయాజ్ అలీ, దామెర రమేశ్, పింగళి సామ్యేల్ పాల్గొన్నారు.
ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి


