పండుగకు వెళ్తుండగా ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

పండుగకు వెళ్తుండగా ప్రమాదం

Oct 18 2026 12:18 AM | Updated on Oct 18 2026 12:18 AM

● ఇద్దరు యాదాద్రి జిల్లా వాసుల మృతి ● గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై బొలేరోను ఢీకొట్టిన లారీ

● ఇద్దరు యాదాద్రి జిల్లా వాసుల మృతి ● గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై బొలేరోను ఢీకొట్టిన లారీ

వైరా: పొట్ట కూటి కోసం పక్క రాష్ట్రంలో పనిచేస్తున్న వారు.. దసరా పండుగ కుటుంబీకులతో జరుపుకోవాలని స్వగ్రామానికి బయలుదేరారు. కానీ గమ్యం చేరకుండానే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. దేవరపల్లి – ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కామునిగూడెం గ్రామానికి చెందిన వరికుప్పల మల్లేష్‌(40) నాలుగేళ్లుగా ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్‌ వద్ద పనిచేస్తున్నారు. ఆయనతో పాటు అదే గ్రామానికి ఉపేందర్‌(32), మండల కేంద్రానికి చెందిన వ్యాస వెంకటరెడ్డి కూడా అక్కడే పనికి చేరారు. దసరా సమీపించడంతో ఈ ముగ్గురు స్వగ్రామంలో కుటుంబంతో కలిసి పండుగ జరుపుకోవాలని బయలుదేరారు. హైవే మీదుగా వీరు వెళ్తున్న బొలేరో టెంపో వాహనాన్ని అతివేగంగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. బొలేరో వెనుక భాగంలో కూర్చున్న మల్లేష్‌, ఉపేందర్‌ వాహనం నుంచి లారీ టైర్ల కింద పడడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో వెంకటరెడ్డి, మరో ఐదుగురికి కూడా గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న వైరా పోలీసులు స్థలానికి చేరుకుని క్షతగాత్రులు, మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైరా సీఐ వెంకటప్రసాద్‌, ఎస్‌ఐ పి.రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement