ఖమ్మం లీగల్: ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి చికిత్సకు గాను పరిహారం చెల్లించాలని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్ జాబేజ్ శామ్యూల్, సభ్యులు వి.లలిత, ఏ.మాధవీలత శనివారం తీర్పునిచ్చారు. ఈ కేసు వివరాలు.... బోనకల్ మండలం రాపల్లికి చెందిన తోట రామాంజనేయులు తన కుటుంబీకులతో కలిసి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా 2024లో పాలసీ తీసుకుని, గత ఏడాది రెన్యువల్ చేసుకున్నారు. ఆయన కుమార్తె అనారోగ్యం బారినపడడంతో ఆస్పత్రిలో చేర్పించి, ఇన్సూరెన్స్ కంపెనీ వారిని సంప్రదిస్తే నగదు రహిత సదుపాయాన్ని నిరాకరించారు. ఆతర్వాత వైద్య ఖర్చులు, ఇతర బిల్లులను సమర్పిస్తే వాటికి కూడా తిరస్కరించడంతో న్యాయవాదుల ద్వారా కేసు నమోదు చేశారు. ఈమేరకు ఫిర్యాదుదారుకు అయిన ఖర్చులు రూ.39,537ను ఏడు శాతం వడ్డీతో చెల్లించడమే కాక వేదనకు గురి చేసినందుకు రూ.10వేలు, ఖర్చుల నిమిత్తం రూ.10వేలను 45 రోజుల్లో చెల్లించాలని తీర్పునిచ్చారు.


