ఖమ్మం మామిళ్లగూడెం: వచ్చే 2047 నాటికి ‘వికసిత్ భారత్’ సాధనే లక్ష్యంగా అంతా కలిసిరావాలని బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ 25ఏళ్ల రాజకీయ ప్రస్థానం సందర్భంగా ఖమ్మంలో బుధవారం సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు. అనంతరం జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావుతో కలిసి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ 2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎంగా తొలిసారి పగ్గాలు చేపట్టిన మోదీ ఆతర్వాత ప్రజల మద్దతుతో దేశ ప్రధానిగా ఎదిగారని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరావు, నాయకులు రుద్ర ప్రదీప్, రామలింగేశ్వరావు, మేకల నాగేందర్, ఆర్వీఎస్.యాదవ్, అల్లిక అంజయ్య, నున్నా రవి, శ్యామ్‌రాథోడ్, అనంతు ఉపేందర్, నరేష్ పాల్గొన్నారు.


