సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలో ఈనెల 11నుంచి 13వ తేదీ వరకు నిర్వహించే మాస్‌లైన్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. స్థాని క నీలం రామచంద్రయ్య భవనంలో బుధవారం ఆయన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గోకినపల్లి వెంకటేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. మార్కిస్ట్ సైద్ధాంతిక, రాజకీయ కృషిలో భాగంగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన సత్తుపల్లి మాధురి ఫంక్షన్ హాల్‌లో మూడు రోజుల పాటు రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర నలు మూలల నుంచి 200 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. ఈసమావేశంలో జిల్లా కార్యదర్శి సీ.వై.పుల్లయ్య, నాయకులు గోకినేపల్లి లలిత, గంట శ్రీనివాసరావు, బీరెల్లి లాజర్, అమర్లపూడి శరత్, ఒగ్గు నాగిరెడ్డి, తాటి రాజు పాల్గొన్నారు.


