డిప్యూటీ సీఎంకు శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎంకు శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వానం

Oct 8 2026 12:24 AM | Updated on Oct 8 2026 12:24 AM

ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 11నుంచి 20వ తేదీ వరకు శ్రీదేవి శరన్నవ రాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ హైదరాబాద్‌లో బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆలయ ఈఓ కె.జగన్మోహన్‌రావు, చైర్మన్‌ ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ ఆహ్వానపత్రం అందజేశారు. అలాగే, ఉత్సవాల ప్రచార కరపత్రాలు, వాల్‌పోస్టర్లను డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు.

పేదల సొంతింటి

కల సాకారం

వెలుగుమట్లలో నిర్మాణాలు పరిశీలించిన కలెక్టర్‌ దివాకర

ఖమ్మం అర్బన్‌: ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదలు సొంతింటి కల సాకారం చేసుకోవాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. సూచించారు. ఖమ్మం వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్యతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పురోగతిపై లబ్ధిదారులతో మాట్లాడాక, నవంబర్‌ నెలాఖరులోగా పూర్తి చేసి అంతర్గత రోడ్లు, ఇతర మౌలిక వసతులు కూడా కల్పించాలని అధికారులను ఆదేశించారు. నిరుపేదలైన లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేయించగా, బిల్లులు కూడా దశల వారీగా అందుతాయని తెలిపారు. ట్రెయినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ పారస్‌కుమార్‌, హౌసింగ్‌ పీడీ భూక్యా శ్రీనివాస్‌, తహసీల్దార్‌ జయచందర్‌, ఈఈ జగ్గారావు, ఏఈలు పాల్గొన్నారు.

అండర్‌–19 కబడ్డీ, రగ్బీ జట్ల ఎంపిక

ఖమ్మం స్పోర్ట్స్‌: అండర్‌–19 విభాగంలో జూని యర్‌ కళాశాలల స్థాయి కబడ్డీ, రగ్బీ జిల్లా జట్లను బుధవారం ఎంపిక చేశారు. ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఎంపిక పోటీ ల అనంతరం జట్ల వివరాలను జిల్లా క్రీడా సంఘం కార్యదర్శి ఎం.డీ.మూసాకలీం వెల్లడించా రు. బాలుర కబడ్డీ జట్టులో లక్ష్మీగణేష్‌, సాయిరాం, సతీష్‌, నితీష్‌కుమార్‌, రోహిత్‌, శివ, ఉపేందర్‌, శశికాంత్‌, విష్ణువర్ధన్‌, తరుణ్‌కుమార్‌, సందీప్‌, హరినాథ్‌, బాలికల జట్టులో మై శ్రీ, జమున, శ్రీవల్లి, సానియా మీర్జా, రాజేశ్వ రి, శృతి, పూజ, హస్య, దివ్య జోషికా, లలితా, వినీల చోటు దక్కించుకున్నారు. అలాగే, బాలుర రగ్బీ జట్టులో నగేష్‌, రోహిత్‌కుమార్‌, ధోని, శశికర్‌, అశోక్‌కుమార్‌, అభిలాష్‌, రామ్‌చరణ్‌, అభినవ్‌, అభినయ్‌, మణికంఠ, సంతోష్‌, రామేష్‌. సంజయ్‌, బాలికల జట్టుకు హిమఝూన్సీ, సునీత, భవాని, తస్రీనా, నస్రీ న్‌, అక్షిత, నందిని, జయంతి, వర్షిణి, నస్మిత, తబసుమ్‌, అక్షయ ఎంపికయ్యారు.

‘చేయూత’ దరఖాస్తులపై డీపీఓ విచారణ

కారేపల్లి: చేయూత పథకం ద్వారా కొత్తగా పింఛన్‌ దరఖాస్తులపై మండల స్థాయి అధికారుల విచారణ పూర్తికాగా, జిల్లా స్థాయి అధికారులతో విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు కారేపల్లి మండలం గాదెపాడులో దరఖాస్తుదారులను జిల్లా పంచాయతీ అధికా రి వినోద్‌కుమార్‌ బుధవారం విచారించారు. వితంతువులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి పత్రాలు, అర్హతలపై ఆరా తీశారు. ఆతర్వాత అంగన్‌వాడీ కేంద్రంలో జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా జరిగిన సమావేశంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయడంతో పాటు పోషకాహారం ప్రాధాన్యతను వివరించారు. ఐసీడీఎస్‌ సీడీపీఓ కె.ఉమ, ఎంపీఓ మల్లెల రవీంద్రప్రసాద్‌, సర్పంచ్‌ భూక్యా రంజిత్‌ కుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement