రీజియన్‌లోని డిపోల వారీగా ప్రత్యేక బస్సుల వివరాలు
రద్దీకి అనుగుణంగా సర్వీసులు
● ఖమ్మం రీజియన్‌లో 1,642 ప్రత్యేక బస్సులు ● హైదరాబాద్ నుంచి రాకపోకలకు అత్యధిక సర్వీసులు ● సెలవులు సమీపించడంతో సన్నాహాల్లో అధికారులు
ఖమ్మం మయూరిసెంటర్: దసరా పండుగ సెలవులు సమీపిస్తున్నాయి. తెలంగాణ పెద్ద పండుగ కావడంతో హైదరాబాద్, ఇతర నగరాల్లో ఉంటున్న వారంతా స్వగ్రామాలకు రావడం ఆనవాయితీ. ఈనేపథ్యాన సొంత ఊళ్లకు వచ్చే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఖమ్మం రీజియన్ వ్యాప్తంగా 1,642 ప్రత్యేక బస్సులను నడిపించాలని అధికారులు నిర్ణయించారు.
రాకపోకలకు..
ఈనెల 9వ తేదీ నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వచ్చే వారితో రద్దీ ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణికుల కోసం 630 రిజర్వేషన్ సర్వీసులు సహా మొత్తం 909 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. పండుగ ముగిశాక ఈనెల 21 నుండి 25వ తేదీ వరకు ఉమ్మడి జిల్లా నుండి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణాలు ఉంటాయి. వీరి కోసం 405 రిజర్వేషన్ సర్వీసులతో పాటు మొత్తం 733 ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. నిత్యం తిరిగే 145 సాధారణ షెడ్యూల్ సర్వీసులకు ఇవి అదనంగా నడిపిస్తారు.
అందుబాటులో రిజర్వేషన్
ఈనెల 9న 73, 10న 65 రిజర్వేషన్ సర్వీసులు, 16, 17, 18, 19వ తేదీల్లో వరుసగా 81, 81, 73 రిజర్వేషన్ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. అయితే, రిజర్వేషన్‌కు డిమాండ్ దృష్ట్యా సర్వీసులు పెంచనున్నారు. రిజర్వేషన్ సౌకర్యం ఉండడంతో ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ప్రయాణించే అవకాశం లభిస్తుంది.
డిపో హైదరాబాద్ డిపో నుంచి మొత్తం
నుంచి డిపోకు హైదరాబాద్‌కు
ఖమ్మం 279 216 495
మధిర 191 102 293
సత్తుపల్లి 172 140 312
భద్రాచలం 114 132 346
కొత్తగూడెం 68 57 125
మణుగూరు 55 50 105
ఇల్లెందు 30 36 66
మొత్తం 909 733 1,642
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రిజర్వేషన్ సర్వీసులు పెంచుతాం. ఆర్‌టీసీ అధికారిక వెబ్‌సైట్ www. tgsrtcbus. in ద్వారా లేదా గమ్యం యాప్ ద్వారా కానీ ఏటీబీ ఏజెంట్లు, బస్టాండ్లలోని కౌంటర్లలో కానీ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. స్వగ్రామాలకు వచ్చివెళ్లే వారు ఆర్టీసీ బస్సులను
ఎంచుకునే సురక్షిత ప్రయాణం చేయాలి.
– సరిరామ్, ఆర్‌ఎం, ఖమ్మం రీజియన్


