జ్వరంతో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

జ్వరంతో మహిళ మృతి

Oct 8 2026 12:24 AM | Updated on Oct 8 2026 12:24 AM

తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలు గ్రామపంచాయతీ పరిధి పాపాయిగూడెంకు చెందిన ఏలూరి హైమావతి(40) జ్వరంతో బాధపడుతూ మృతి చెందింది. గ్రామానికి చెందిన సిద్దారావు – హైమావతి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉండగా, వారి చదువుల నిమిత్తం ఏడాదిగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. మూడు రోజుల క్రితం హైమావతి జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురవగా కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా ప్లేట్‌లెట్లు తగ్గిపోయి పరిస్థితి విషమించి మృతి చెందింది. ఆమె డెంగీ జ్వరంతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. కాగా, హైమావతి మృతదేహాన్ని పాపాయిగూడెం తీసుకురాగా పలువురు నివాళులర్పించారు.

చికిత్స పొందుతున్న వ్యక్తి ..

పెనుబల్లి: మండలంలోని రామచంద్రరావు బంజర్‌ వద్ద గత నెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వేంసూరు మండలం అడవిరామన్నపాలెం గ్రామానికి చెందిన తుంగా సత్యం – బుచ్చమ్మ వారి కుమార్తె ఉండే రామచంద్రరావు బంజర్‌ వచ్చారు. రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పెనుబల్లిలో చికిత్స అనంతరం ఖమ్మం తరలించగా పరిస్థితి విషమించి తుంగా సత్యం బుధవారం మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతున్న మహిళ...

రఘునాథపాలెం: అనారోగ్య సమస్యలు భరించలేక ఎలుకల నివారణ పేస్ట్‌ తిన్న ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. రఘునాథపాలెం మండలం రాంక్యాతండాకు చెందిన ఇస్లావత్‌ స్వాతి (35) టైలరింగ్‌ చేసేది. అనారోగ్య సమస్యలు తట్టుకోలేక ఈనెల 1న ఆమె ఎలుకల నివారణ పేస్ట్‌ మింగడంతో భర్త, కుటుంబీకులు ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ కోలుకున్నాక ఇంటికి తీసుకురాగా, 5న మళ్లీ కడుపునొప్పి రావడంతో ఖమ్మంకు, అక్కడి నుంచి హైదరాబాద్‌ నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేయిస్తుండగా బుధవారం మృతి చెందింది. ఘటనపై ఆమె బావ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, స్వాతి సోదరుడు బాలాజీ మాత్రం తన అక్కడ భర్త వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులకు మరో ఫిర్యాదు చేశాడు.

రైలు కిందపడి యువకుడు..

ఖమ్మంక్రైం: రైలు కిందపడిన ఓ యువకుడు మృతి చెందాడు. ఖమ్మం సుందరయ్యనగర్‌ పత్తి మార్కెట్‌ ప్రాంతానికి చెందిన అజ్మీరా రాంకుమార్‌(24) స్థానికంగా వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. బుధవారం షాప్‌నకు వెళ్తున్నట్టు చెప్పి బయలుదేరిన ఆయన నర్తకి థియేటర్‌ ప్రాంతంలో రైలు కిందపడి మృతి చెందాడు. ఆయన వద్ద ఆధారాల ప్రకారం తండ్రి సుమన్‌కు పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే, ప్రమాదవశాత్తు జరిగిందా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అన్న అంశంపై విచారణ చేస్తున్నామని జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్‌ మురళీకృష్ణ తెలిపారు. కాగా, రాంకుమార్‌ మృతదేహన్ని అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ మెంబర్‌ అన్నం శ్రీనివాసరావు సాయంతో మార్చురీకి తరలించారు.

ఆటో ప్రమాదంలో గాయపడిన మహిళ..

రఘునాథపాలెం: మండలంలోని రేగులచలక వద్ద ఈనెల 2న వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను టిప్పర్‌ ఢీకొట్టిన ఘటనలో గాయపడిన మరో మహిళ మృతి చెందింది. ఖమ్మం రూరల్‌ మండలం కామంచికల్‌ గ్రామానికి చెందిన కూలీలు పంగిడి సమీపాన పత్తితీత వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో అదేరోజు భారతమ్మ మృతి చెందిన విషయం విదితమే. ఘటనలో గాయపడిన మరో 12మందికి ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా మాదాసు రమణ(58) పరిస్థితి విషమించి బుధవారం కన్నుమూసింది. ఇంకో 11 మందిలో ఐదుగురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుండగా మిగిలిన వారు స్పల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా, రమణకు ఒక కుమారుడు ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement