మానసిక వైద్యం.. ఆనందం | - | Sakshi
Sakshi News home page

మానసిక వైద్యం.. ఆనందం

Oct 3 2026 12:14 AM | Updated on Oct 3 2026 12:14 AM

ఈ ఏడాది ఇప్పటివరకు

చికిత్స అందుకున్న బాధితులు

వ్యసన విముక్తి చికిత్సతో

బాధిత కుటుంబాల్లో హర్షం

వైద్యసేవలే కాక అవగాహన కూడా..

పెద్దాస్పత్రి డీ అడిక్షన్‌ సెంటర్‌లో

సేవలు

ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మంలోని జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా నాణ్య మైన వైద్యంతో పాటు మానసిక వైద్యవిభాగం ద్వారా బాధితులకు మెరుగైన సేవలు అందుతున్నా యి. సాధారణ మానసిక సమస్యల మొదలు, వ్య సన విముక్తి, చట్టపరమైన సంరక్షణ వరకు ప్రత్యేక శ్రద్ధతో సేవలు అందిస్తున్నారు. సాధారణ మానసిక వైద్యసేవల విభాగంలో మానసిక వైద్య చికిత్సతో పాటు బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వచ్చే సమస్యలకు వ్యాధి నిర్ధారణ, సంపూర్ణ చికిత్స సేవలు కొనసాగుతున్నాయి. నెలకు సుమారు 300 కేసులు నమోదవుతుండగా, కేసు తీవ్రత ఆధారంగా 3– 5 ఐదేళ్ల కాలపరిమితితో చికిత్స చేస్తున్నారు. ఇక వ్యసన విముక్తి(డీ – అడిక్షన్‌) సేవల్లో భాగంగా మద్యం, పొగాకు, గంజాయి వంటి మాదక ద్రవ్యా ల బారిన పడిన వారికి చికిత్స అందుతోంది. బాధితులకు కౌన్సెలింగ్‌తో పాటు అవసరమైన వైద్య సేవలు అందించి కొత్త జన్మ వచ్చేలా వైద్యులు కృషి చేస్తున్నారు. ఇది సత్ఫలితాలను ఇస్తుండడం బాధిత కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతోంది.

కొత్త జీవితం

పెద్దాస్పత్రిలోని డీ అడిక్షన్‌ సెంటర్‌లో ప్రతీనెల దాదాపు 60 మందికి వ్యసనాల నుంచి స్వేచ్ఛ, పునరావాసాన్ని కల్పిస్తున్నారు. బాధితుల స్థితి ఆధారంగా చికిత్స కొనసాగుతుంది. మాదక ద్రవ్యాల బారి న పడితే ఎనిమిది వారాల పాటు కౌన్సెలింగ్‌, మార్గదర్శకత్వం ఇస్తారు. ఆ తర్వాత ర్యాపిడ్‌ డ్రగ్‌ ప్యా నెల్‌ టెస్టింగ్‌ చేసి ఫలితం నెగెటివ్‌ అని వస్తే న్యాయస్థానానికి నివేదిక ఇచ్చి కేసు కొట్టేసేలా విజ్ఞప్తి చేస్తా రు. వైద్య – న్యాయ సంబంధిత సేవలు ఈ విభా గంలో నెలకు 20 నమోదు కాగా, నెలకు సగటున ఐదుగురు వ్యసనం నుంచి పూర్తిగా బయటపడుతున్నారు. అలాగే ప్రతీ గురువారం ట్రాన్స్‌జెండర్ల కోసం ఔట్‌ పేషంట్‌ సేవలు నిర్వహిస్తున్నారు. నిపుణులైన వైద్యులతో చికిత్స, కౌన్సెలింగ్‌ అందిస్తుండగా, నెలకు సగటు ఐదు కేసులు వస్తున్నాయి. మానసిక వైద్య విభాగం ద్వారా పోక్సో బాధితులకు సేవలు అందిస్తూ మానసిక స్థితి విశ్లేషణ, కౌన్సెలింగ్‌, వైద్యంపై న్యాయస్థానానికి నివేదికలు ఇస్తారు.

ఖైదీలకు మాససిక చికిత్స

జైలులో శిక్ష అనుభవించే ఖైదీలకు మానసిక చికిత్సలో భాగంగా మందులు ఇస్తూ కౌన్సెలింగ్‌ చేస్తున్నా రు. అలాగే, సామాజికంగా బలహీనమైన వారికి ఉచిత న్యాయసాయం అందేలా చూస్తున్నారు. నెలకు సుమారు 10 మంది ఖైదీలు సమస్యలతో ఆస్పత్రికి వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక మెడికల్‌ బోర్డు సేవల కింద నెలకు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల మానసిక స్థితి పరీక్షించి పెన్షన్‌, వారసత్వ హక్కుల విషయంలో అర్హత / అనర్హత నిర్ధారిస్తున్నారు. కాగా, ఈ విభాగంలో ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఒక సీనియర్‌ రెసిడెంట్‌, ఒక డీఆర్‌పీ పీజీ వైద్యుడు, నర్సింగ్‌ సిబ్బంది విధుల్లో ఉన్నారు. అవసరమైన మేర నిపుణులను నియమించడంతో పాటు సైకియాట్రిక్‌ వైద్యులను కేటాయిస్తే మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఏర్పడుతుంది.

కేసు సంఖ్య

పోక్సో 52

డీ అడిక్షన్‌ 452

సాధారణ ఓపీ 1809

ఇన్‌ పేషంట్లు 69

ట్రాన్స్‌జెండర్లు 09

ఖైదీలు 51

ఫోరెన్సిక్‌ డీ అడిక్షన్‌ 55

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement