జర్నలిస్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని విడనాడాలి | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని విడనాడాలి

Oct 3 2026 12:14 AM | Updated on Oct 3 2026 12:14 AM

ఖమ్మం సహకారనగర్‌: జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారంపై రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌(టీజేఎఫ్‌) జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి అన్నారు. యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అన్ని మండలాల్లో జర్నలిస్టులు వారం పాటు చేపట్టే పోస్ట్‌ కార్డు ఉద్యమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖమ్మంలో జర్నలిస్టులు పోస్ట్‌కార్డులతో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతరం మహిళా డిగ్రీ కళాశాల వద్దకు ర్యాలీగా వెళ్లి కార్డులో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడగా, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రజినీకాంత్‌తో పాటు గుద్దేటి రమేష్‌బాబు, మందుల ఉపేందర్‌, యలమందల జగదీష్‌, అమరవరపు కోటేశ్వరరావు, బిక్కీ గోపి, కోటేశ్వరరావు, రేపాక యాదగిరి పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఇళ్ల స్థలాలు, హెల్త్‌ కార్డులు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాటేటి వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గాంధీ విగ్రహానికి సమర్పించారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏనుగు వెంకటేశ్వరరావు, మైసా పాపారావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చేయ డం సరికాదన్నారు. నాయకులు నలజాల వెంకటరావు, వనం వెంకటేశ్వర్లు, నర్వనేని వెంకట్రావు, మామిడాల భూపాల్‌, పసునూరి మహేందర్‌, కన కం సైదులు తదితరులు పాల్గొన్నారు.

మండల కేంద్రాల్లో...

నేలకొండపల్లి/కొణిజర్ల/తల్లాడ/పెనుబల్లి/ఏన్కూరు/చింతకాని: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని వివిధ మండల కేంద్రాల్లో నిరసన తెలి పారు. నేలకొండపల్లిలో టీయూడబ్ల్యూజే(ఐజే యూ) జిల్లా ఉపాధ్యక్షుడు పోలంపల్లి నాగేశ్వరరా వు ఆధ్వర్యాన నిరసన తెలపగా అర్హత కలిగిన ప్రతీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలం, హెల్త్‌కార్డు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కొణిజర్లలో ఐజేయూ జిల్లా సభ్యుడు మోటపోతుల బాబూరావు, కొర్లపాటి సురేష్‌ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ వైద్య సేవలను పునరుద్ధరించి ఇతర సమస్యలు పరిష్కరించాలని తల్లాడ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యాన పోస్టుకార్డులు పంపారు. ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు జి.నారాయణ, గౌరవ అధ్యక్షు డు అజయ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి జయరాజు తదితరులు పాల్గొన్నారు. పెనుబల్లి మండలం వీఎం బంజరలో నల్లమల అరుణ్‌ ప్రతాప్‌, వేముల రవి, రమేష్‌, సలీం, జనార్దన్‌ తదితరులు పాల్గొన్నా రు. ఇక చింతకానిలో జరిగిన నిరసనలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా సభ్యుడు గార్లపాటి రమేష్‌ మాట్లాడగగా పెరిక నాగేశ్వరరావు, మంద శివకృష్ణ, అలవాల వెంకటనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఏన్కూరులో అక్రిడిటేషన్‌ కమిటీ మండల అధ్యక్షుడు బండి శంకర్‌ మాట్లాడగా, చింతనబోయిన నర్సింహరావు, హిమామ్‌, కూరకుల రామరావు, కొవ్వూరి రామారావు, ఎక్కిరాల వంశీ తదితరులు పాల్గొన్నారు.

వినతిపత్రంతో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) నాయకులు

గాంధీ విగ్రహం వద్ద పోస్టు కార్డులతో

టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్‌) నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement