ఖమ్మంరూరల్: ప్రతీ ఖైదీని సంస్కరించి జైలు నుంచి విడుదలయ్యాక గౌరవప్రదమైన జీవి తాన్ని గడిపేలా సంస్కరణలు అమలవుతున్నాయని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా ఖమ్మం రూరల్ మండలంలోని జిల్లా జైలులో శుక్రవారం ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీ సోమిరెడ్డి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఖైదీల్లో మార్పు తీసుకురావడానికి విద్య, నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందుతోందని చెప్పారు. మత్తు పదార్థాల రవాణా, వినియోగం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారు భవిష్యత్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటామని ప్రతిన బూనాలని, ఇందుకోసం శిక్షకాలాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం క్రీడా, సాంస్కతిక పోటీల్లో విజేతలైన ఖైదీలకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్, ఎకై ్సజ్, జైళ్లు, న్యాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రేపు పీఆర్‌టీయూ
జిల్లా కౌన్సిల్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని పీఆర్‌టీయూ కార్యాలయంలో ఈనెల 4న జరిగే జిల్లా కౌన్సిల్‌ను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్‌రావు కోరారు. కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌన్సిల్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పులగం దామోదర్‌రెడ్డి, సుంకర బిక్షం గౌడ్, ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరవుతారని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు, నాయకులు మోత్కూరి మధు, యలమద్ది వెంకటేశ్వర్లు, వెంకటనర్సయ్య, విజయ్, అమృత్‌కుమార్, ఆర్.బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు.
పందిళ్లపల్లి రేక్
పాయింట్‌కు యూరియా
చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు శుక్రవారం స్పిక్ కంపెనీకి చెందిన 603.45 మెట్రిక్ టన్నుల యూరియా చేరిందని ఖమ్మం డీఏఓ ధనసరి పుల్లయ్య తెలిపారు. ఇందులో నుంచి ఖమ్మం జిల్లాకు 403.45 మె. టన్నులు, భద్రాద్రి జిల్లాకు 200 మె.టన్నులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాక వివిధ రకాల ఎరువులు 701 మె.టన్నుల మేర చేరుకోగా కోటా వారీగా జిల్లాలకు సరఫరా చేశామని ఆయన తెలిపారు.
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర
కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రామకృష్ణ
ఖమ్మంమయూరిసెంటర్: అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్) రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన ఇటికాల రామకృష్ణ ఎన్నికయ్యారు. ఇటీవల హనుమకొండలో జరిగిన సంఘం 90వ వార్షికోత్సవాల ముగింపు సభల్లో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ఏఐఎస్‌ఎఫ్ జాతీయ, రాష్ట్ర నాయకులు, సీపీఐ జిల్లా సమితి బాధ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగం, విద్యార్థుల సమస్యల పరిష్కారం, జిల్లాలో జనరల్ యూనివర్సిటీ, ఐఐటీ, ఐఐఎం ఏర్పాటుకు పోరాడుతామని వెల్లడించారు.
వైరా ఫొటోగ్రాఫర్‌కు అవార్డు
వైరా: ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా, ఏపీ సృజనాత్మకత, సాంస్కృతిక కమిషన్ సంయుక్త ఆధ్వర్యాన నిర్వహించిన ఫొటోగ్రాఫీ ఫొటోల్లో వైరా వాసి ముత్యాల నాగేశ్వరరావు కు అవార్డు దక్కింది. ‘నా భారతదేశం – 80 ఏళ్ల ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ’ ఇతివృత్తంతో నిర్వహించిన ఈ పోటీలకు జాతీయ స్థాఽయిలో 300 మంది పోటీ పడ్డారు. ఇందులో నాగేశ్వరరావు అవార్డుకు ఎంపిక కాగా, ఏపీలోని గుంటూరులో జరిగిన సమావేశంలో నాగార్జున యూనివర్సిటీ వీసీ కె.గంఽగాధరరావు, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు సన్మానించారు.


