పురుగుల మందు తాగి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి ఆత్మహత్య

Oct 3 2026 12:14 AM | Updated on Oct 3 2026 12:14 AM

మీరు మారరు, నేనే లోకాన్ని విడిచి వెళ్తున్నా..

బోనకల్‌: అనారోగ్య కారణాలతో వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని ముష్టికుంట్లకు చెందిన షేక్‌ మీరాసాహెబ్‌(70)కు పది రోజుల క్రితం అనారోగ్యం బారిన పడగా ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు రెండు కిడ్నీలు పాడైనట్లు నిర్ధారిచండమే కాక మద్యం తాగొ ద్దని సూచించారు. అయినా మీరాసాహెబ్‌ మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని భార్యను అడగగా ఆమె నిరాకరించింది. దీంతో ఆయన గురువారం మధ్యాహ్నం పురుగుల మందు తాగగా ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఆయన భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.

●భర్త, కుమారుడి తీరుతో మహిళ ఆత్మహత్య

ఖమ్మంక్రైం: భర్త జేబుదొంగ, కుమారుడు గంజాయి సేవించి జులాయిగా తిరుగుతున్నాడు. పలుమార్లు జైలుకు వెళ్లివచ్చినా మారకపోగా వారికి చెప్పిచెప్పి విసిగిపోయిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం సుందరయ్యనగర్‌కు చెందిన సందరి అరుణ కూలీ పనులతో జీవనం సాగిస్తోంది. ఆమె భర్త శివ ఏ పని చేయకపోగా దొంగతనాలు అలవాటుగా మార్చుకున్నాడు. ఆమె కుమారుడు శ్రావణ్‌ సైతం గంజాయికి అలవాటు పడ్డాడు. పలుమార్లు చెప్పినా వారు మారే పరిస్థితి లేకపోవడంతో అరుణ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం త్రీటౌన్‌ సీఐ చిట్టిబాబు తెలిపారు.

వివాహం కావడం లేదని యువకుడు...

కూసుమంచి: పెండ్లి సంబంధాలు చూస్తున్నా ఖాయం కావడం లేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని జీళ్లచెరువుకు చెందిన ఐతగాని ఆదిలక్ష్మి పదేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ ఇళ్లలో పనిచేస్తోంది. ఆమె కుమారుడు భీష్మ(24) జీళ్లచెరువులో ఒంటరిగా ఉంటున్నాడు. ఆయనకు వివాహం చేయాలని సంబంధాలు చూస్తున్నా ఏదీ ఖాయం కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈమేరకు గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై ఆయన తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.

చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి

మధిర: కుటుంబ కలహాల నేపథ్యాన పురుగుల మందు తాగిన వ్యక్తి పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మండలంలోని జిలుగుమాడుకు చెందిన యలమద్ది సాంబశివరావు(55) ఇరవై రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. ఆయనకు కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగానే పరిస్థితి విషమించి మృతి చెందాడు. రైస్‌ మిల్లులో సూపర్‌వైజర్‌గా పనిచేసే సాంబశివరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై మధిర టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement