● రేపు జిల్లా కేంద్రంలో పరీక్ష ● రెండు కేంద్రాల్లో హాజరుకానున్న 668 మంది అభ్యర్థులు
● పరీక్ష ఉదయం 9నుంచి 12–30గంటల వరకు జరుగుతుంది
● అభ్యర్థులను కేంద్రాల్లోకి ఉదయం 7నుంచి 8–30గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు.
● అభ్యర్థులు ఫొటోతో కూడిన ఒరిజనల్ గుర్తింపు కార్డును తప్పక వెంట తెచ్చుకోవాలి.
● ఎంబీబీఎస్ ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఒరిజనల్, జిరాక్స్ కాపీ తీసుకురావాలి.
● ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ గడియారాలు, బూట్లు తదితర వస్తువులు ధరించి రావొద్దు.
ఖమ్మం సహకారనగర్: వైద్యవిద్యకు సంబంధించి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం జరగనున్న పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. జిల్లాలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 668 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఖమ్మంలోని ఎస్‌బీఐటీలో 268 మంది, కొణిజర్లలోని అయాన్ డిజిటల్ జోన్(లక్ష్య కళాశాల) కేంద్రంలో 400 మందికి సెంటర్ కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈమేరకు కేంద్రాల్లో ఏర్పాట్లను అదనపు కలెక్టర్ పిన్‌రెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా కోఆర్డినేషన్ ఆఫీసర్ కె.రవిబాబు శుక్రవారం పరిశీలించారు.


