ఆషాఢమాసంలో పలు ప్రాంతాల ప్రజలు బోనాల పండుగ జరుపుకోవడం
ఆనవాయితీ. ఈ సందర్భంగా సంస్కృతి,
సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో శనివారం బోనాల జాతర
నిర్వహించారు. ఇందుకోసం ప్రత్యేకంగా అమ్మవారి ఆలయం సెట్లు వేయించగా.. విద్యార్థినులు అమ్మవార్లుగా, విద్యార్థులు పోతురాజుల వేషధారణలో ఆకట్టుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు పండుగ ప్రత్యేకతలు వివరించారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్


