గోదావరి జలాలు
ఏన్కూరు: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యాన జిల్లా ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా గోదావరి జలాలు విడుదల చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రెండు రోజులుగా జిల్లాకు చేరుతున్న నీటిని ఏన్కూరు మండలం రెడ్డిగూడెంలో సాగర్ ఎడమ కాల్వ వద్ద శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఏన్కూరు రెగ్యులేటరీ వద్ద సాగర్ కాల్వలోకి సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా నీరు చేరుతుండగా, చెరువులకు, ప్రాజెక్టులకు తరలిస్తున్నట్లు తెలిపారు.
కాల్వ పనుల నాణ్యతలో రాజీ పడొద్దు
తల్లాడ: సాగర్ కాల్వల ఆధునికీకరణ పనుల నాణ్యతలో రాజీ పడొద్దని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. తల్లాడ మండలం రెడ్డిగూడెం సమీపాన ఎన్నెస్పీ కాల్వను పరిశీలించిన ఆయన సిరిపురం మేజర్‌లో ఆధునికీకరణ పనులపై సూచనలు చేశారు. కార్యక్రమాల్లో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సీఈ శ్రీనివాసరెడ్డి, డీఈ చంద్రశేఖర్, ఏఈ వంశీ, కాంగ్రెస్ జిల్లా, మండల అధ్యక్షులు నూతి సత్యనారాయణ, శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు స్వర్ణ నరేందర్, భూక్యా లాలు, లేళ్ల వెంకటరెడ్డి, కొప్పుల ప్రభావతిరెడ్డి, మేడ ధర్మారావు, తంబళ్ల సామేలు, సైదులు, గొడుగునూరి లక్ష్మీరెడ్డి, పైడిపల్లి రవి, తిరుమల్‌రావు, కాపా సుధాకర్ పాల్గొన్నారు.
రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క


