రూ.67లక్షల విలువైన గంజాయి స్వాధీనం
వైరా: వైరా మీదుగా కారులో తరలిస్తున్న గంజా యి, హషీష్ ఆయిల్‌ను ఎకై ్సజ్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ జి.గణేష్ ఆధ్వర్యాన ఎస్‌ఐ సీహెచ్.శ్రీహరిరావు, ఉద్యోగులు వైరా ఐఎంఎల్ డిపో ఎదురుగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఓ కారులో పరిశీలించగా 101.2 కేజీల ఎండు గంజాయి, 2.7 కేజీల హషీష్ ఆయిల్ లభ్యమైంది. దీని విలువ రూ.67.20 లక్షలు ఉంటుందని ఏసీ గణేష్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌కు చెందిన మహ్మద్ అస్లామ్ ఒడిశా రాష్ట్రం కలిమెలలో కొనుగోలు చేసిన గంజాయి, ఆయిల్‌ను హైదరాబాద్ తరలిస్తున్నట్లు తేలిందన్నారు. ఈమేరకు ఇస్లామ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కాగా, గంజాయి, మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే టోల్‌ఫ్రీ నంబర్ 18004252523కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్ ఉద్యోగులు ఎం.ఏ.కరీమ్, బాలు, సుఽధీర్, వెంకట్, హరీష్, వీరబాబు, హన్మంతరావు, విజయ్, ఉపేందర్ పాల్గొన్నారు.
ఏదులాపురంలో 24కిలోలు...
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి ఏదులాపురం క్రాస్ మీదుగా ఆటోలో తరలిస్తున్న 24కిలోల గంజాయిని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. కూసుమంచి మండలం గురవాయిగూడెంకు చెందిన పుట్టమంతి ఉదయ్, ఖమ్మంరూరల్ మండలం తల్లంపాడుకు చెందిన ఎరుపుల అఖిల్ ఒడిశా రాష్ట్రానికి చెందిన నూకరాజువద్ద గంజాయికొనుగోలుచేసి ఆటోలో ఖమ్మం పరిసర ప్రాంతాల్లో అమ్మకానికి తీసుకొస్తున్నారు. ఈమేరకు తనిఖీల్లో పట్టుబడగా ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.
ఒడిశా నుంచి
హైదరాబాద్‌కు తరలిస్తున్న నిందితుడు


