సెల్‌టవర్‌ ఎక్కిన రైతు | - | Sakshi
Sakshi News home page

సెల్‌టవర్‌ ఎక్కిన రైతు

Feb 25 2026 7:15 AM | Updated on Feb 25 2026 7:15 AM

సెల్‌టవర్‌ ఎక్కిన రైతు

సెల్‌టవర్‌ ఎక్కిన రైతు

నేలకొండపల్లి: భూపంచాయితీని పరిష్కరించడం లేదంటూ ఓ రైతు సెల్‌టవర్‌ ఎక్కి నిరసనకు దిగాడు. సెల్‌ఫోన్‌ ఫ్లైట్‌ మోడ్‌లో పెట్టడంతో ఆయనను సంప్రదించడం సాధ్యం కాక ఉద్రిక్తత నెలకొంది. చివరకు మూడు గంటల అనంతరం ఆయనే దిగిరావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలంలోని చెరువుమాధారం గ్రామానికి చెందిన ఆకుల శ్రీను కు కుటుంబ వారసత్వంగా వచ్చిన భూమి తన పేరిట రిజిస్ట్రేషన్‌ కాలేదని.. ఫలితంగా ప్రభుత్వ పథకాలు అందడం లేదని వాపోయినట్లు తెలిసింది. ఈమేరకు మంగళవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆయన పైనంపల్లి వద్ద సెల్‌ టవర్‌పైకి ఎక్కాడు. దీంతో పోలీసులు చేరుకుని ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే, ఫోన్‌ ఫ్లైట్‌ మోడల్‌లో పెట్టుకోవడం, చీకటి పడడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఈమేరకు అగ్నిమాపక శాఖ చేరుకోగా, పోలీసులు పర్యవేక్షించారు. చివరకు రాత్రి 9గంటలకు శ్రీను తనకు తానే టవర్‌ దిగిరావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఇటీవల యూరియా కోసం సూర్యాపేట జిల్లాలోని కోదాడలో కూడా శ్రీను టవర్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేయడం గమనార్హం.

మూడు గంటల పాటు

కొనసాగిన నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement