బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల ఎంపికకు దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల ఎంపికకు దరఖాస్తులు

Feb 23 2026 7:03 AM | Updated on Feb 23 2026 7:03 AM

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల ఎంపికకు దరఖాస్తులు

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల ఎంపికకు దరఖాస్తులు

ఖమ్మంగాంధీచౌక్‌: కొండా లక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్ర అవార్డులకు చేనేత కళాకారులు మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎం.విజయలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత కళాకారులకు అవార్డులు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోందని పేర్కొన్నారు. చేనేత కళాకారులు, చేనేత డిజైనర్లకు వారి వృత్తిలో నైపుణ్యత, ప్రత్యేకతల ఆధారంగా అవార్డులు ఇస్తుందని తెలిపారు. అవార్డు గెలుచుకున్న వారికి రూ.25 వేల నగదు బహుమతి, చేనేత శాలువ, మెమెంటో, మెరిట్‌ సర్టిఫికెట్‌ ఇస్తారని వివరించారు. దరఖాస్తుదారులకు 2025 డిసెంబర్‌ 31 నాటికి 30 ఏళ్లు నిండి ఉండాలని, చేనేత రంగంలో పదేళ్లకు తగ్గకుండా అనుభవం ఉండాలని తెలిపారు. డిజైనర్ల వయసు 25 ఏళ్లకు పైన ఉండాలని, ఈ రంగంలో ఐదేళ్లకు తగ్గకుండా అనుభవం ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తులను ఏడీ, చేనేత, జౌళి శాఖ హన్మకొండ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.

ఖమ్మంసహకారనగర్‌: బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకానికి ఎంపిక కోసం గుర్తింపు పొందిన ప్రైవేట్‌ పాఠశాలల బాధ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తింపు కలిగి, గత ఐదేళ్లలో 7, 10వ తరగతిలో 90శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత, 50 శాతం కంటే ఎక్కువ విద్యార్థులు మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని తెలిపారు. అంతేకాక విశాలమైన గదులు, క్రీడా ప్రాంగణం, లైబ్రరీ, కంప్యూటర్‌ ల్యాబ్‌, అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది ఉన్న పాఠశాలల బాధ్యులు పూర్తి వివరాలతో కలెక్టరేట్‌లోని ఎస్సీ డీడీ కార్యాలయంలో మార్చి 25లోగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

మార్చి 31లోగా

దరఖాస్తు చేసుకోవాలి

జూడోలో బ్రౌన్‌ మెడల్‌

తల్లాడ: మండలంలోని

రంగంబంజర గ్రామానికి చెందిన ధర్మసోత్‌ చరణ్‌ నాయక్‌ సీఎం కప్‌ జూడో పోటీలో జిల్లా తరఫున పాల్గొని బ్రౌన్‌ మెడల్‌ సాధించాడు. హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం జరిగిన పోటీలో ఉత్తమ ప్రతిభను కనబర్చాడు. ఈ సందర్భంగా చరణ్‌ను పలువురు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement