డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు సెంచరీ! | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు సెంచరీ!

Aug 14 2025 7:27 AM | Updated on Aug 14 2025 7:27 AM

డిగ్రీ కళాశాలలో  ప్రవేశాలు సెంచరీ!

డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు సెంచరీ!

మధిర: మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశాల సంఖ్య వందకు చేరిందని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.రవీంద్రారెడ్డి తెలిపారు. కళాశాలలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో కళాశాలకు బీఎస్సీ లైఫ్‌ సైన్సెస్‌, బీఎస్సీ ఫిజికల్‌ సైన్స్‌ గ్రూపులు మంజూరయ్యాయని తెలిపారు. దీంతో ప్రవేశాలకు విద్యార్థులు ముందుకొచ్చారని పేర్కొన్నారు. కాగా, దోస్త్‌ ద్వారా దరఖాస్తు చేసుకుని డిగ్రీలో చేరని, దరఖాస్తు చేయని విద్యార్థుల కోసం త్వరలో స్పాట్‌ అడ్మిషన్లు ఉంటాయని ప్రిన్సి పాల్‌ వెల్లడించారు. ప్రవేశాలు వందకు చేరేలా కృషి చేసిన అధ్యాపకులు, విద్యార్థులు తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

బొగ్గు ఉత్పత్తి, కార్మికుల సంక్షేమమే లక్ష్యం

సత్తుపల్లిరూరల్‌: బొగ్గు ఉత్పత్తిలో రక్షణ పాటిస్తూనే కార్మి కుల సంక్షేమమే లక్ష్యం గా సింగరేణి ముందుకు సాగుతోందని డీజీఎం యోహాన్‌ తెలిపారు. కొత్తగూడెం ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఎం.షాలేంరాజు ఆధ్వర్యాన సత్తుపల్లి జేవీ ఆర్‌ ఓసీ కార్యాలయంలో బుధవా రం జరిగిన మల్టీ డిపార్ట్‌మెంట్‌ టీం సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష్యం మేర బొగ్గు ఉత్పత్తి కోసం ఉద్యోగులు, కార్మికులు సహకరించాల ని సూచించారు. ఇందుకోసం యంత్రాల పనిగంటలు పెంచాలని తెలిపారు. అనంతరం మల్టీ డి పార్ట్‌మెంట్‌ కమిటీ సమావేశాల లక్ష్యాలు, బొగ్గు ఉత్పత్తి లక్ష్యం, ఉద్యోగుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో జేవీఆర్‌ ఓసీ పీఓ ప్రహ్లాద్‌, ఉద్యోగులు కె.హనా సుమలత, కె.సూర్యనారా యణరాజు, మోహన్‌రావు, బి.రాజేశ్వరరావు, డి. శ్రీనివాసరావు, జి.కల్యాణ్‌రామ్‌, ఎస్‌.గోవింద్‌, దుర్గాప్రసాద్‌రెడ్డి, నర్సింహారావు, రామారావు, దేవదాస్‌ పాల్గొన్నారు.

సింహపూరి,

కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దు

ఖమ్మం రాపర్తినగర్‌: మూడో రైల్వేలైన్‌ నిర్మాణ పనుల కారణంగా సింహపురి, కృష్ణా ఎక్ప్‌ప్రెస్‌ రైళ్లను నిర్ణీత తేదీల్లో రద్దు చేశారు. సికింద్రాబాద్‌ నుంచి గూడూరు(12710) వెళ్లే సింహపురి ఎక్స్‌ప్రెస్‌(12710)ను ఈనెల 14, 17, 18వ తేదీల్లో, గూడూరు – సికింద్రాబాద్‌ మార్గం(12709)లో ఈనెల 15, 18, 19వ తేదీల్లో రద్దు చేసినట్లు అధి కారులు తెలిపారు. అలాగే, తిరుపతి నుంచి ఆది లాబాద్‌ వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌(12705)ను ఈనెల 13నుంచి 19వ తేదీ వరకు, ఆదిలాబాద్‌ – తిరుపతి మార్గం(12706)లో ఈనెల 14నుంచి 20వ తేదీ వరకు రద్దు చేసినట్లు సీసీటీఓ రాజగోపాల్‌ వెల్లడించారు.

పశు వైద్యాధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా హరీష్‌

ఖమ్మంవ్యవసాయం: పశువైద్యాధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్‌ అనంతు హరీష్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ఖమ్మం పశువైద్య, పశుసంవర్థక శాఖ కార్యాలయంలో బుధవారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్‌ పశువైద్యాధికారి హరీష్‌ మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ మానుకొండ రాకేష్‌కుమార్‌(వైరా), కోశాధికారిగా డాక్టర్‌ రఘుపతి(ఖమ్మం పశువైద్య ప్రయోగశాల)తో పాటు కార్యవర్గ సభ్యులుగా డాక్టర్లు ఉషశ్రీ, శశిదీప్‌, జానీ, కృష్ణారెడ్డి, సృజనను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా కె.ప్రదీప్‌కుమార్‌ వ్యవహరించగా, పశువైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎం.రమేష్‌బాబు, వైద్యులు ఉపేందర్‌, అశోక్‌, సుబ్బారావు, రాంజీ, రాజు, భువనేష్‌, సమీరా, స్వాతిలత తదితరులు పాల్గొన్నారు.

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల ముఖాముఖికి సుజాత

ఖమ్మం సహకారనగర్‌: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఆరుగురు ముఖాముఖికి ఎంపిక కా గా, కేంద్ర విద్యాశాఖ నిపుణుల కమిటీ, రాష్ట్ర ఉన్నతాధికారులు బుధవారం ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహించారు. జిల్లాలోని ఏన్కూరు మండలం బురద రాఘవాపురం పాఠశాల బయాలజీ ఉపాధ్యాయురాలు సాగి సుజాత కూడా ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి ఆమె ఇంటర్వ్యూలో పాల్గొనగా విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలర్‌, జేడీ మదన్‌మోహన్‌ ఆమెను సత్కరించారు. కాగా, పది రోజుల్లో ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా వెలువడే అవకాశముంది.

హోంగార్డుకు గాయాలు

తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం పెట్రోల్‌బంక్‌ సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంతో హోంగార్డుకు తీవ్రగాయాలయ్యాయి. గోల్‌తండాకు చెందిన ఉపేంద్రయ్య(ఉపేందర్‌) హోంగార్డు(డ్రైవర్‌)గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన బుధవారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా పెట్రోల్‌ బంక్‌ సమీపాన కింద పడడంతో తలకు గాయమైంది. దీంతో సీహెచ్‌సీలో చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement