
నిరంతర పర్యవేక్షణ
మున్నేటి
వరదపై
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంతో పాటు మున్నేటి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నందున మున్నేరుకు వచ్చే వరదను నిరంతరం పర్యవేక్షిస్తూ ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య సూచించారు. మున్నేటి వరదల నేపథ్యాన ప్రత్యేక అధికారిగా వచ్చిన జి.వేణుగోపాల్‌తో కలిసి కమిషనర్ అధికారులు, వార్డు ఆఫీసర్లతో సమీక్షించారు. అయితే, 16అడగుల మేర వరద రాగానే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి పరీవాహక కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.
ఈ విషయమై వలంటీర్ల ద్వారా స్థానికులను అప్రమత్తం చేయాలని తెలిపారు. కాగా, ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఎంపిక చేసిన వలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. నగరంలోని 12 డివిజన్ల ముంపు ప్రాంతాల్లో 240 మందిని ఎంపిక చేయగా వారికి కేఎంసీ అధికారులు హ్యాండ్ మైకులు, టార్చ్‌లైట్లు, రైయిన్‌కోట్లు అందజేశారు. అలాగే, ముంపు ప్రాంతాల ప్రజలు సర్టిఫికెట్లు భద్రపరుచుకునేలా కవర్లు సరఫరా చేస్తున్నారు.
పాలేరుకు తగ్గిన వరద
కూసుమంచి: మండలంలోని పాలేరురిజర్వాయ ర్‌కు వరద తగ్గుముఖం పట్టింది. మంగళవారం రాత్రివరకు 17వేల క్యూసెక్కుల వరదచేరగా బు ధవారం సాయంత్రానికి 8,250 క్యూసెక్కులకు పడిపోయింది. ఈమేరకు రిజర్వాయర్‌కు సాగర్ నుంచి 2,168క్యూసెక్కుల నీరుసరఫరాఅవుతోం ది. దీంతో దిగువకు 2,043 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే, అలుగు ద్వారా 8,095 క్యూసెక్కుల నీరు పాలేరు ఏటిలో కలుస్తుండగా, రిజర్వాయర్ నీటిమట్టం 23.50 అడుగులుగా నమోదైంది. ఈమేరకు రిజర్వాయర్‌ను జలవనరులశాఖ ఎస్‌ఈమంగళంపూడి వెంకటేశ్వర్లు పరి శీలించి వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీ లించాలని ఉద్యోగులకు సూచించారు.

నిరంతర పర్యవేక్షణ