
రైతుల ఆందోళన
కొణిజర్ల: యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళనకు సిద్ధం కాగా అధికారులు నచ్చచెప్పారు. కొణిజర్ల మండలంలోని సాలెబంజర, సింగరాయపాలెం, తీగలబంజర, కొణిజర్ల తదితర గ్రామాల రైతులు యూరియా కోసం మంగళవారం కొణిజర్లలో సొసైటీ కార్యాలయానికి వచ్చారు. కానీ స్టాక్ లేదని సిబ్బంది చెప్పడంతో రైతులు ఆగ్రహంగా రోడ్డుపై బైఠాయించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసి ఎస్‌ఐ జి.సూరజ్ చేరుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని నచ్చచెప్పడంతో వారు వెనక్కి తగ్గారు. అనంతరం ఏఓ బాలాజీ మాట్లాడుతూ రెండు రోజులలో యూరియా రానుందని తెలిపారు.