
నాటిక పోటీల్లో విజేత.. ‘ఖరీదైన జైళ్లు’
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలో నాలుగురోజుల పాటు జరిగిన తెలుగు రాష్ట్రాల స్థాయి నాటికల పోటీల్లో విజేతల వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. కరీంనగర్ చైతన్యభారతి కళాసంస్థ ప్రదర్శించిన ఖరీదైన జైళ్లు, హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారు ప్రదర్శించిన అమ్మ చెక్కిన బొమ్మ, తాడేపల్లికి చెందిన అరవింద్ ఆర్ట్స్ కళాకారులు ప్రదర్శించిన విడాకులు కావాలి నాటికలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. మొత్తం తొమ్మిది నా టికలు ప్రదర్శించగా రంగస్థల నటులు సుబ్బ రాయ శర్మ, మేక రామకృష్ణ, గోవిందరావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈమేరకు మొదటి మూడు స్థానాల్లో నిలిచిన నాటికలు ప్రదర్శించిన సంస్థలు, ఉత్తమ దర్శకులు, నటులకు బహుమతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అన్నాబత్తుల సు బ్రహ్మణ్యకుమార్, మోటమర్రి జగన్మోహన్‌రావు, దేవేంద్ర, డాక్టర్ నాగబత్తిని రవి, వేల్పుల విజేత, నామ లక్ష్మీనారాయణ, వేముల సదానందం తదితరులు పాల్గొన్నారు.