
కేజీబీవీలకు ఆదరణ..
జిల్లాలోని కేజీబీవీల్లో
గత ఏడాది, ఈ ఏడాది ప్రవేశాలు
కస్తూర్బా కళాశాలల్లో పెరిగిన
అడ్మిషన్లు
ఫలితమిచ్చిన ఇంటింటి ప్రచారం
ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది
8,234 మంది చేరిక
పాల్వంచరూరల్: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు.. అందుతున్న బోధన సత్ఫలితాలను ఇస్తున్నాయి. కేజీబీవీ ల్లో విద్యార్థినులకు ఉచిత భోజనం, వసతి, దుస్తులు ఇవ్వడంతో పాటు నాణ్యమైన బోధన అందుతోంది. గత వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయడంతో ఉమ్మడి జిల్లాలోని 28 కస్తూ ర్బాగాంధీ కళాశాలల్లో ఈ ఏడా ది ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పెరిగా యి. కొన్ని కళాశాలల్లో కొంతమేర తగ్గినా.. మొత్తంగా చూస్తే ప్రవేశాల సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు.
మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు
ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో 8,234 మంది విద్యార్థినులు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరారు. భద్రాద్రి జిల్లాలోని కేజీబీవీల్లో 3,719 మంది చేరగా, ఖమ్మం జిల్లా కేజీబీవీల్లో 4,515 మంది ప్రవేశాలు పొందారు. అయితే, ప్రవేశాలు పెరిగినా ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో ఇంకా 544 సీట్లు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని ఎర్రుపాలెంలో 23, పెనుబల్లి 34, సింగరేణి 20, లింగాల 24, బోనకల్ 24, కూసుమంచి 23, ఏన్కూరు 14, కొణిజర్ల 15, ముదిగొండలో ఎనిమిది ఖాళీగా ఉన్నాయి. ఆయా సీట్ల భర్తీకి ఈనెల 15 వరకు స్పాట్ ఆడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు సమగ్రశిక్షా అభియాన్ జీసీడీఓ ఎం.తులసి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
కస్తూర్బా కళాశాలల్లో పెరిగిన
అడ్మిషన్లు
ఫలితమిచ్చిన ఇంటింటి ప్రచారం
ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది
8,234 మంది చేరిక
జిల్లాలోని కేజీబీవీల్లో గత ఏడాది, ఈ ఏడాది ప్రవేశాలు
2024 – 25 2025 – 26
ఎర్రుపాలెం 277 283
పెనుబల్లి 219 300
సింగరేణి 309 341
లింగాల 291 263
బోనకల్ 289 318
కూసుమంచి 302 334
ఏన్కూరు 317 329
కొణిజర్ల 281 288
ముదిగొండ 311 330
చింతకాని 330 334
ఖమ్మం 317 352
రఘునాథపాలెం 300 330
తిరుమలాయపాలెం 359 354
కొత్తూరు (వై) 369 369
మొత్తం 4,271 4,515

కేజీబీవీలకు ఆదరణ..