
ఎయిడ్స్‌పై అవగాహన అవసరం
ఖమ్మంవైద్యవిభాగం/ఖమ్మం స్పోర్ట్స్: ప్రతి ఒక్కరు ఎయిడ్స్‌పై అవగాహన కలిగి ఉండాలని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి సూచించారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం వద్ద సోమవారం ఆమె 5కే రన్‌ను డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. యువత ఎయిడ్స్‌పై అవగాహన పెంచుకోవడమే అనర్థాలను ఇంకొందరికి వివరించాని సూచించారు. కాగా, రన్‌లో 100 మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు పాల్గొనగా బాలికల విభా గంలో ఎస్.కే.ఆప్రిన్, నాగజ్యోతి, బాలుర విభాగంలో అనిల్, ఎస్.గోపీచంద్ మొదటి రెండు స్థానాల్లో నిలవడంతో నగదు బహమతులు అందజేశారు. ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ శాఖ, వివిధ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్ పీఓలు డి.సత్యకుమార్, ఎం.డీ.అలీ, వీరయ్య, రామకృష్ణ, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
మెరిట్ జాబితాపై
అభ్యంతరాల స్వీకరణ
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో వైద్యాధికారుల నియామకానికి మెరిట్ జాబితా విడుదల చేశామని డీసీహెచ్‌ఓ డాక్టర్ కె.రాజశేఖర్‌గౌడ్ తెలిపారు. ఈనెల 6న నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ఎంపిక చేసిన వారితో సిద్ధం చేసిన జాబితాను https:// khammam. telangana. gov. in వెబ్‌సైట్‌లో పొందుపర్చామని వెల్లడించారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో ఈనెల 14లోగా సమర్పించాలని ఆయన సూచించారు.
ఆలయ నిర్వహణ,
అభివృద్ధికి రూ.5 లక్షలు
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి జేవీఆర్ పార్కు ఎదురుగా ఉన్న శ్రీహరిహరాత్మజ అయ్యప్పస్వామి ఆలయ నిర్వహణ, అభివృద్ధికి బెంగళూరుకు చెందిన భక్తుడు సోమవారం రూ.5లక్షలు అందజేశారు. వాసవీ కన్‌స్ట్రక్షన్స్ అధినేత గాధంశెట్టి నాగరాజు ఈ నగదు అందజేశాక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆల య కమిటీ చైర్మన్ దోసపాటి అమరలింగేశ్వరరావు, బొంతు శ్రీనివాసరావు, అర్చకులు సురేష్ ఆచార్యులు పాల్గొన్నారు.
ఊరచెరువుకు బుంగ
బోనకల్: మండలంలోని ము ష్టికుంట్ల గ్రామ ఊరచెరువుకు బుంగ పడడంతో నీరు వృథా గా పోతోంది. ఇటీవల కురిసి న వర్షాలకు చెరువుకట్ట తూము వద్ద పెద్దఎత్తున బుంగ పడింది. దీంతో నీరు వృథా అవుతున నేపథ్యాన అధికారులు మరమ్మతు చేయించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
పలుచోట్ల
ఓ మోస్తరు వాన
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని పలు ప్రాంతా ల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆదివారం ఉద యం 8–30నుంచి సోమవారం ఉదయం 8–30 గంటల వరకు వాతావరణ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం జిల్లాలో సగటున 20.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధి కంగా బోనకల్ మండలంలో 58.6 మి.మీ.గా నమోదవగా చింతకానిలో 49.4, కల్లూరులో 38.4, కొణిజర్లలో 33.4, పెనుబల్లిలో 32.2, కూసుమంచిలో 31.8, తల్లాడలో 29.2, నేలకొండపల్లిలో 28.4, కామేపల్లిలో 20.8 మి.మీ. వర్షపాం నమోదైందని వెల్ల డించారు. అలాగే, వైరా, తిరుమలాయపాలెం, సత్తుపల్లి, ఖమ్మం అర్బన్, మధిర, ఖమ్మం రూరల్, ముదిగొండ, రఘునాథపాలెం, ఏన్కూ రు, సింగరేణి మండలాల్లోనూ వర్ష ప్రభావం కని పించింది. ప్రస్తుతం కురుస్తున్న వాన సాగులో ఉన్న పత్తి, వరి, ఇతర పంటలకే కాక వరినాట్లకు ప్రయోజనాన్ని కలిగిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.

ఎయిడ్స్‌పై అవగాహన అవసరం

ఎయిడ్స్‌పై అవగాహన అవసరం