
నిరుద్యోగుల కోసం డీఈఈటీ యాప్
ఖమ్మం సహకారనగర్: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత – ఉద్యోగాకాశాలు కల్పించే పరి శ్రమల నడుమ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్ ఆఫ్ తెలంగాణ(డీఈఈటీ) యాప్ వారధిలా పని చేస్తుందని అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవా రం వారు డీఈఈటీ యాప్ పనితీరుపై అధికారులతో సమీక్షించారు. నిరుద్యోగులు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేస్తే వారి నైపుణ్యాలకు అనుగుణంగా పరిశ్రమలు అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు. అంతేకాక ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్ షిప్, నైపుణ్య శిక్షణ సంస్థలు, జాబ్‌మేళాల వివరాలు అందుతాయని చెప్పారు.
జాయింట్ సర్వే చేయాలి
ఆర్ అండ్ బీ, ఎన్‌హెచ్, పంచాయతీరాజ్ అధికారులు రోడ్లనిర్మాణ సమయాన మిషన్ భగీరథ పైప్‌లైన్లు దెబ్బతినకుండా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి సూచించారు. రోడ్ల మంజూరు సమయంలోనే సంయుక్తంగా సర్వే చేసి తాగునీటి పైప్‌లైన్ తరలింపు పనుల అంచనాలు కూడా పొందుపర్చాలని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కొత్త సంఘాల ఏర్పాటుపై దృష్టి
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా లేని మహిళలను గుర్తించి కొత్త సంఘాలు ఏర్పాటు చేయించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. ఖమ్మం టీటీడీసీ భవనంలో ఏపీఎంలు, సీసీలకు సెర్ప్ ఆధ్వర్యాన సోమవారం ఇచ్చిన శిక్షణలో ఆమె మాట్లాడారు. మహిళలతో పాటు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, కిషోర బాలి కలతో కొత్త సంఘాలు ఏర్పాటు చేయించాలని తెలి పారు. అనంతరం ఏపీఎంలు, సీసీ లతో ప్రతిజ్ఞ చేయించారు. డీఆర్‌డీఏ పీడీ సన్యాసయ్య, డీపీఎం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.