
240మందికి సైకిళ్లు, వెయ్యి మందికి యూనిఫామ్
సత్తుపల్లి: అప్పట్లో ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర సౌకర్యాలే ఉన్నా కష్టపడి చదువుకుని ఈ స్థాయికి చేరామని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి వెల్లడించారు. ఊరి నుంచి మూడు తెలిపా రు. ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం సబ్‌కలెక్టర్ అజయ్‌యాదవ్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థినులకు 240 మందికి ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సైకిళ్లు పంపిణీ చేశారు. అలాగే, సత్తుపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో వెయ్యి మంది విద్యార్థులకు యూనిఫామ్, నోట్ పుస్తకాలు, వాటర్ బాటిళ్లు, బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికై న 12 మందికి రూ.60వేల నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. అలాగే, పాతసెంటర్ హైస్కూ ల్‌లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యాన డాక్టర్ ఇమ్మడి నిఖిల్ సహకారంతో 45మందికి రూ.వెయ్యి విలువైన కిట్లు, మండల స్థాయి రూ.10వేల చొప్పు న అందజేశాక ఎమ్మెల్యే మాట్లాడారు. మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్, నాయకులు గాదె చెన్నారావు, దొడ్డా శ్రీనివాసరావు, వందనపు సత్యనారాయణ, మలిరెడ్డి మురళీరెడ్డి, తోట సుజలరాణి, ఎం.డీ.కమల్‌పాషా, నారాయణవరపు శ్రీని వాస్, చల్లగుళ్ల నర్సింహారావు మున్సిపల్ కవిషనర్ నర్సింహ, తహసీల్దార్ సత్యనారాయణ, పాల్గొన్నారు. కాగా, ఎమ్మెల్యే రాగమయికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
పుట్టినరోజు సందర్భంగా అందించిన ఎమ్మెల్యే రాగమయి