
టేబుల్ టెన్నిస్ ఉమ్మడి జల్లా జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ జట్లను ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో సోమవారం ఎంపిక చేశారు. ఈమేరకు జట్ల వివరాలను టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలసాని విజయ్‌కుమార్, వీవీఎస్.సాంబమూర్తి తెలిపారు. అండర్–11 బాలుర జట్టులో అనుమోలు శ్రేయన్, జాయ్, ఈశ్వర్, హేమంత్ సాయి, నిహాల్ కృష్ణ, యశ్వంత్, రోషన్, బాలికల జట్టుకు బాలసాని హర్వికలక్ష్మి, పి.ఆరాధ్య, తోట జిజ్ఞాస, రోస్మిత, అండర్–13 బాలికల జట్టులో పర్స వంషిక, బాలసాని తన్మయిశ్రీ, బొంతు సాయిశివాని, బాలుర జట్టులో కోటగిరి హితేష్ శ్రీరంగా, ఈ.హరి, అభిలాష్, అన్వేష్, సాయి హర్షిత్ ఎంపికయ్యారని వెల్లడించారు. అలాగే, అండర్–15 బాలికల జట్టులో హర్షిత, అఖిల, స్పందన చంద్ర, చిలకబత్తిన పావని, బాలురు జట్టుకు షేక్ సాహెల్ ఫజల్, జి.చార్విక్, ఈ.తరుణ్, ఏ.ఉజ్వల్, ప్రజ్ఞ, అండర్–17 బాలురు జట్టుకు పరిటాల జ్వలిత్, పిట్టల మోహిత్ కృష్ణ, రామ్ సాకేత్, రణధీర్‌రెడ్డి, సైఫ్, అనస్, బాలికల జట్టులో గద్దల సిరి, పి.అమత, జి.చంద్రికరాణి, షర్మిలరాణి, సుప్రియ, అండర్–19 బాలికల జట్టులో బి.అఖిల, సౌమ్య, స్ఫూర్తి, రష్మీ, బాలురు జట్టులో జెస్సీ, ధనుష్, గుణ సోమశేఖర్ ఎంపికయ్యారని తెలిపారు. ఆయా జట్లు ఈనెల 22నుంచి హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొంటాయని అసోసియేషన్ బాధ్యులు వెల్లడించారు.