
శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారికి శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి పాదానికి, శ్రీస్వామివారి విగ్రహానికి వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. శ్రీవారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లను అలంకరించి నిత్య కల్యాణం జరిపించగా.. భక్తులు కనులపండువగా తిలకించారు. శ్రీవారికి పల్లకీ సేవ చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కొత్తూరి జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్‌శర్మ, మురళీమోహన్‌శర్మ పాల్గొన్నారు.
ట్రాఫిక్ సమస్య
పరిష్కరించాలి: సీపీ
ఖమ్మంక్రైం : నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీపీ సునీల్‌దత్ సిబ్బందిని ఆదేశించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సీసీ కెమెరాల విస్తరణ, నిబంధనలు అతిక్రమించే వాహనదారుల నుంచి జరిమానాల వసూలు తదితర అంశాలపై చర్చించారు. మునిపల్ కార్పొరేషన్ అధికారుల సమన్వయంతో సరైన పార్కింగ్ స్థలాలు గుర్తించాలని సూచించారు. ఖమ్మంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను ఆరికట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీపీ వెంట ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, సీఐ సత్యనారయణ, ఆర్‌ఐ సాంబశివరావు, ఎస్‌ఐ సాగర్ ఉన్నారు.
జిల్లాకు చేరిన
బ్యాలెట్ బాక్స్‌లు
ఖమ్మం సహకారనగర్ : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నాలుగు రోజుల క్రితం గుజరాత్ నుంచి 2,300 బ్యాలెట్ బాక్స్‌లను కేటాయించింది. ఈ క్రమంలో శనివారం రెండు కంటైనర్లలో వాటిని తీసుకొచ్చి జిల్లా పరిషత్ ఆవరణలోని గోడౌన్‌లో భద్రపర్చినట్లు అధికారులు తెలిపారు.
సెప్టెంబర్ 3న
దివ్యాంగుల మహాగర్జన
సత్తుపల్లిటౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగుల పెన్షన్ రూ.6వేలు, వృద్ధులకు రూ.4వేలు, పూర్తి వైకల్యం చెందిన వారికి రూ.15 వేలు ఇస్తామని ప్రకటించిందని, 20 నెలలైనా హామీలు అమలు చేయడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ విమర్శించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సెప్టెంబర్ 3న హైదరాబాద్‌లో దివ్యాంగుల మహాగర్జన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సత్తుపల్లి జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సభను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు, నియోజకవర్గ కన్వీనర్ వీరంరాజు మంద కృష్ణను సత్కరించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో బాణోతు విజయ్, సాలి శివ, జొన్నలగడ్డ నరేష్, మట్టా ప్రసాద్, లక్ష్మీనారాయణ, సాధు జానికీరాం పాల్గొన్నారు.

శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు