
పోరాటాలతోనే హక్కుల సాధన
కారేపల్లి/సత్తుపల్లిరూరల్ : పోరాటాలతోనే ఆదివాసీల హక్కులు సాధ్యమవుతాయని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. శనివారం కారేపల్లిలో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీలు నేటికీ విద్య, ఉద్యోగ, ఉపాధి, వైద్య అవకాశాలకు దూరంగా ఉన్నారని, పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబాటుకు గురవుతున్నారని ఆరోపించారు. ఆదివాసీ గూడేల్లో కనీస సౌకర్యాలు కూడా ఉండడం లేదన్నారు. ప్రతి ఒక్కరు కొమం భీం స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఆదివాసీలు సంప్రదాయ వేషధారణలో కొమరం భీం సెంటర్ నుంచి బస్టాండ్, సినిమాహాల్, అంబేడ్కర్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు దుగ్గి కృష్ణ, బచ్చలి వెంకటేశ్వర్లు, రాంప్రసాద్, ఈసం భాస్కర్, వీసాల రాంబాబు, యదళ్లపల్లి శ్రీనివాస్, వజ్జా రామారావు, వట్టం నాగేశ్వరరావు, శివరాం, జ్యోతి, రామారావు, సరోజిని, సత్యనారాయణ, స్వామి, పెంటయ్య పాల్గొన్నారు.
హక్కుల పరిరక్షణకు ఉద్యమిద్దాం..
సత్తుపల్లిరూరల్ : ఆదివాసీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాడులు చేస్తూ వారిని అడవుల నుంచి తరిమివేస్తున్నాయని, వారి హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలని మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు అన్నారు. సత్తుపల్లిలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు అడవుల్లో స్వేచ్ఛగా జీవించిన ఆదివాసీలు ఇప్పుడు భయంభయంగా బతుకీడుస్తున్నారని అన్నారు. ఆదివాసీల సంరక్షణకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నామని నేటి పాలకులు గొప్పలు చెబుతున్నా.. విద్య, ఉద్యోగ, వైద్య రంగాల్లో నేటికీ వెనుకబడే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు అమర్లపూడి శరత్, ఎ.వెంకన్న, కాటేనేని శ్రీనివాసరావు, గంటా శ్రీను, కొర్సా వెంకటేష్, దుంపా రాఘవులు, ఆదాం సాహెబ్, మారుతి శ్రీను, పుచ్చ కృష్ణవేణి, కృష్ణ, అరుణ్‌కుమార్, హనుమంతరావు పాల్గొన్నారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో వక్తలు