
దళితుల నడుమ భూవివాదం
చింతకాని: గత ప్రభుత్వం దళిత కుటుంబాలకు భూమి పంపిణీ చేయగా.. నెలకొన్న వివాదం ఒకరిపై హత్యాయత్నానికి దారి తీసింది. చింతకాని ఎస్సీ కాలనీలో గురువారం అర్ధరాత్రి నారపోగు రామకృష్ణపై అదే కాలనీకి చెందిన 12మంది హత్యాయత్నానికి పాల్పడగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించి పోలీసులు వెల్ల డించిన వివరాలు... బీఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి పంపిణీ చేయగా చింతకానిలో తొమ్మిది కుటుంబాలకు 27 ఎకరా లు అందాయి. అయితే, భూమి రాని వారు, భూమి పొందిన వారి నడుమ వివాదం నెలకొంది. ఈ విషయమై రెండు రోజుల క్రితం కొందరు తహసీల ఎదుట దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యాన నారపోగు రామకృష్ణ కాలనీలో గురువారం రాత్రి జరిగిన ఫంక్షన్ నుంచి ఇంటికి వస్తుండగా కాపు కాసిన ఉసికల నాగరాజు, మరో 11 మంది కత్తులు, కొడవళ్లతో దాడి చేశారు. దీంతో రామకృష్ణ మెడ వద్ద తీవ్ర గాయం కాగా ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఘటన సమాచారం తెలుసుకున్న వైరా ఏసీపీ రహమాన్, సీఐ సాగర్ నేతృత్వాన గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. అలాగే, బాధితుడి ఫిర్యాదుతో 12మందిపై కేసు నమోదు చేయగా ఇద్దరిని అరెస్ట్ చేశామని ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు.
చింతకానిలో వ్యక్తిపై హత్యాయత్నం