
విద్యుత్‌తో ప్రమాదం జరగొద్దు..
ఖమ్మంవ్యవసాయం: ఇళ్లలో బట్టలు ఆరేసేందుకు ఇనుప తీగలు కడుతుండగా విద్యుత్ వైర్లు తాకడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయమై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు విద్యుత్ శాఖ అధికారులు రంగంలోకి దిగా రు. ఇందులో భాగంగా ఇనుప తీగలను బట్టలు ఆరేసేందుకు వినియోగించొద్దని.. వీటికి బదులు ప్లాస్టిక్ తీగలే వాడాలని శుక్రవారం విద్యుత్ సిబ్బంది జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించారు. ఉద్యోగులు, సిబ్బంది పలువురు ఇళ్లకు వెళ్లి ఇనుప తీగలు ఉన్న చోట్ల తొలగించి వాటి స్థానంలో ప్లాస్టిక్ తీగలు ఏర్పాటు చేయించారు. వర్షాల నేపథ్యాన ప్రమాదాలకు ఆస్కారమున్నందున ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టినట్లు ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు.
కారణాలు, నివారణపై విస్తృత అవగాహన