
మద్యం మత్తులో మార్కెట్ డైరెక్టర్ హల్‌చల్
కల్లూరు: కల్లూరు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ మద్యం మత్తులో ప్రభుత్వ ఆస్పత్రిలో తనిఖీల పేరిట హల్‌చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెనుబల్లి మండలం చిన్యాతండాకు చెందిన కల్లూరు మార్కెట్ డైరెక్టర్ బాలాజీ బుధవారం తెల్లవారుజామున ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న ఆయన రికార్డులు పరి శీలించాలంటూ సిబ్బందిని బెదిరించినట్లు తెలిసింది. అంతేకాక చికిత్స పొందుతున్న వారిని ఏ ఊరు, ఎందుకు వచ్చారని ఆరా తీస్తూ అందరి సంగతి తేలుస్తానంటూ హడావుడి చేసినట్లు సమాచారం. ఘటనపై వైద్య సిబ్బంది ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి ఆయనకు సర్దిచెప్పి పంపించారు.