
పింఛన్ పెంపు హామీ అమలెప్పుడు?
వైరా/కూసుమంచి/మధిర: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేయూత పింఛన్ మొత్తాన్ని పెంచుతామంటూ ఇచ్చిన హామీని ఇకనైనా అమలుచేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దివ్యాంగుల పింఛన్లు పెంచాలనే డిమాండ్‌తో వైరా, కూసుమంచి మండలం జీళ్లచెరువు, మధిర మార్కెట్ యార్డులో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. దివ్యాంగు పింఛన్‌ను రూ.4వేల నుంచి రూ.6 వేలకు, వితంతువులు, వృద్ధులు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు రూ.2వేలను రూ.4 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేలా త్వరలోనే హైదరాబాద్‌లో నిర్వహించే సభకు జిల్లా నుంచి దివ్యాంగులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈసమావేశాల్లో నాయకులు కారుమంచి వెంకన్న, మాగంటి వెంకటేశ్వర్లు, బత్తుల అంజలి, సంగెపు ఆదినారాయణ, ఎక్కిరాల సుజాత, బానోతు సైదులు, ఆదూరి ఆనందరావు, ఇల్లు వెంకటి, దాసరి కృష్ణవేణి, విలారపు ఉమారాణి, తూరుగంటి అంజయ్య, బెల్లంకొండ రవి, అయినాల కనకరత్నం, సామినేని భవానీచౌదరి, అజ్మీరా భారతి, బొజ్జ జీవరత్నం, పగిడికత్తుల ఈదయ్య, కట్టెకోల వెంకటేశ్వర్లు, తోడేటి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు
మంద కృష్ణ