
జవహర్ లిఫ్ట్ వద్ద సిద్ధమైన పైలాన్
మధిర: ఖమ్మం జిల్లాలోని మధిర, ఎర్రుపాలెం మండలాలను ఎన్నెస్పీ సెకండ్ జోన్‌లోకి మార్చి సాగునీటి సరఫరా కోసం రూ.630.30 కోట్ల నిధులతో జవహర్ ఎత్తిపోతల పథకం నిర్మించనున్నారు. ఈ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. మధిర మండలం వంగవీడులో ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు శంకుస్థాపన చేయనున్న భట్టి, మంత్రులు ఆతర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కాగా, శంకుస్థాపన ప్రదేశం వద్ద పైలాన్‌ను నిర్మించగా మార్కెట్, ఆత్మ కమిటీల చైర్మన్లు బండారు నరసింహారావు, కర్నాటి కోటేశ్వరరావు అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ ఐలూరి సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ వివిధ మండలాల అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సూరంసెట్టి కిషోర్, గాలి దుర్గారావు, శీలం శ్రీనివాసరెడ్డి, నాయకులు అనుమోలు వెంకటకృష్ణారావు, కడియం శ్రీనివాసరావు, దేవరకొండ రాజీవ్‌గాంధీ తదితరులు పాల్గొన్నారు.
రేపు శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం