
సీహెచ్‌పీలో తనిఖీ చేసిన డైరెక్టర్
సత్తుపల్లి: సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌ను శుక్రవారం సింగరేణి డైరెక్టర్(ఎగ్జిక్యూటివ్) బి.వెంకన్న తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బొగ్గు రవాణా, నిర్వహణపై ఆరా తీశారు. అనంతరం సింగరేణి, రైల్వే అధికారులతో సమావేశమయ్యారు. రైలు మార్గం ద్వారా బొగ్గు రవాణాను మరింత పెంచాలని సింగరేణి అధికారులకు, ఖాళీ వ్యాగన్లను సకాలంలో అందించాలని రైల్వే అధికారులకు సూచించారు. కొత్తగూడెం ఏరియా జీఎం షాలేంరాజు, ఉద్యోగులు సూర్యనారాయణరాజు, ప్రహ్లాద్, నర్సింహారావు, సోమశేఖర్‌రావు, మదన్‌మోహన్, తౌర్య, రవికుమార్, ఏ.రాజేంద్రబాబు, కేవై.పాషా పాల్గొన్నారు.