
ఆ దాడులు పాశవికం..
ఖమ్మంమయూరిసెంటర్: గాజాపై ఇజ్రాయిల్ పాశవికంగా చేస్తున్న దాడులను అన్నివర్గాల ప్రజలు నిరసించాలని.. ఇదే సమయాన శాంతి నెలకొల్పేందుకు దేశాధినేతలు కృషి చేయాలంటూ ఖమ్మంలో గురువారం పాలస్తీనా సంఘీభావ కమిటీ ఆధ్వర్యాన భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీలు, సంఘాల నాయకులు, యువజనులు, విద్యార్థులు, న్యాయవాదులు, వైద్యులు, ఉద్యోగులు పాల్గొన్న ఈ ప్రదర్శన పెవిలియన్ మైదానం నుండి మయూరిసెంటర్, వైరా రోడ్డు మీదుగా జెడ్పీ సెంటర్ వరకు కొనసాగింది. ఈసందర్భంగా పాలస్తీనా ప్రజలకు ఆహారం, నీరు అందకుండా వేలాదిమంది ఆకలి చావులకు కారణమవుతున్న ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ అక్కడ ప్రజల దీనస్థితిని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.
ఐక్యమత్యానికి నాంది..
పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను అంతా ఖండించాలని సీపీఐ జాతీయ నాయకుడు అజీజ్ పాషా, మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు మధు, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్ తదితరులు కోరారు. పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా నిర్వహించిన ర్యాలీ ఐక్యమత్యానికి నాందిగా నిలుస్తుందని తెలిపారు. మానవత్వాన్ని మరిచిన ఇజ్రాయెల్ పాలస్తీనాపై దాడులు చేస్తుండగా.. ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసినప్పటికీ కేంద్రప్రభుత్వం స్పందించకపోవడం గర్హనీయమన్నారు. ర్యాలీలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు దండి సురేష్, వై.విక్రమ్, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, రాజేంద్రప్రసాద్, బీ.జీ.క్లెమెంట్, మొక్క శేఖర్‌గౌడ్, మహ్మద్ హుస్సేన్, జైనుల్ పాషా, మహమ్మద్ ఇలియాస్, రవిమారుత్, కాకి భాస్కర్, మువ్వా శ్రీనివాస్, ఐ.వీ.రమణారావు, దేవిరెడ్డి విజయ్, బండారు రమేష్, వి.మనోహర్ రాజు, ఎంఎఫ్.గోపీనాథ్, రవీంద్రనాథ్, తిరుమలరావు, శేషగిరి, విప్లవ కుమార్, సుగుణరావు, జక్కంపూడి నాగేశ్వరరావు, లక్ష్మీనారాయణ, ఇటికాల రామకృష్ణ, వి.వెంకటేష్, టి.ప్రవీణ్, మస్తాన్, సురేష్, బషీర్, నానబాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పాలస్తీనా ప్రజలకు మద్దతుగా
భారీ ప్రదర్శన
పెద్దసంఖ్యలో పాల్గొన్న నాయకులు, విద్యార్థులు

ఆ దాడులు పాశవికం..

ఆ దాడులు పాశవికం..