
పర్యాటక రంగంలో మరింత అభివృద్ధి
నేలకొండపల్లి: జిల్లాను పర్యాటక రంగంలో అగ్రస్థానాన నిలిపేలా అందరూ సహకరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రాన్ని బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్యతో కలిసి గురువారం పరిశీలించిన ఆయన నిర్మాణంలో ఉన్న విశ్రాంతి భవనం, ఇతర పనులపై ఆరా తీశాక అధికారులతో చర్చించారు. ఇక్కడ అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూ.2.50 కోట్లు మంజూరు చేయించారని తెలిపారు. ఈ నిధులతో పర్యాటకుల విడిది కేంద్రం, మ్యూజియం, మెడిటేషన్ హాల్, బుద్ధుడి జీవిత చరిత్ర తెలిపే శిల్పాలు ఏర్పాటుచేయాలని, రెస్టారెంట్, బాలసముద్రం చెరువులో బోటింగ్‌కు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా టూరిజం అధికారి సుమన్ చక్రవర్తి, డీఈ రామకృష్ణ, తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు, ఎంపీఓ సీ.హెచ్.శివ, మాజీ సర్పంచ్ రాయపూడి నవీన్, మాజీ ఎంపీటీసీ బొడ్డు బొందయ్య పాల్గొన్నారు.
రోప్‌వే ఏర్పాటుతో కొత్త అందం
ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మం ఖిల్లాపైకి రోప్‌వే ఏర్పాటైతే కొత్త అందం సంతరించుకుంటుందని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఖమ్మం ఖిల్లా, జాఫర్ బావిని గురువారం పరిశీలించిన ఆయన రూ. 29 కోట్లతో చేపట్టే రోప్ వే ఇతర పనులపై సమీక్షించారు. స్థల సేకరణ వారంలోగా పూర్తిచేసి పనులు మొలుపెట్టాలన్నారు. ఆర్డీఓ నర్సింహారావు, జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి సుమన్ చక్రవర్తి, తహసీల్దార్ సైదులు, పర్యాటక శాఖ డీఈ రామకష్ణ, నిర్మాణ సంస్థ ప్రతినిధి వెంకటేష్ పాల్గొన్నారు.
బౌద్ధక్షేత్రాన్ని పరిశీలించిన కలెక్టర్ అనుదీప్