
పదోన్నతులకు బ్రేక్..
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్–2హెచ్‌ఎంలుగా, ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించేందుకు ఇటీవల షెడ్యుల్ విడుదల చేసింది. సీనియారిటీ, ఖాళీల జాబితా విడుదల చేయడమే కాక సర్టిఫికెట్ల పరిశీలన మొదలవడంతో ఎస్‌ఏల్లో ఆనందం వ్యక్తమైంది. జిల్లాలో గ్రేడ్–2 హెచ్‌ఎంలుగా 260మంది ఎస్‌ఏలకు పదోన్నతులు లభించే అవకాశముందని భావించారు. ఈక్రమాన ఆప్షన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా.. కొందరు తమకు అన్యాయం జరిగిందని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పదోన్నతులకు తాత్కాలికంగా బ్రేక్ వేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈనెల 11వ తేదీన వాదనలు విన్నాక హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా ప్రక్రియ ముందుకు సాగనుందని సమాచారం.
అర్హుల్లో ఆందోళన
గ్రేడ్–2 హెచ్‌ఎంలుగా పదోన్నతి కోసం ఎస్‌ఏలు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో షెడ్యూల్ విడుదల కాగానే ఆనందించినా.. ఇప్పుడు బ్రేక్ పడడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈనెల 11వ తేదీన కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న అంశంపై ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే, గురువారం కూడా పదోన్నతుల విషయమై పలువురు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.
ఉపాధ్యాయుల్లో ఆందోళన