ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలంలోని భీమవరం – కాచారం, అయ్యవారిగూడెం – బుచ్చిరెడ్డిపాలెం మధ్య బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.22.5 కోట్లు విడుదలయ్యాయి. పీఆర్ శాఖ అధికారుల పర్యవేక్షణలో రహదారుల నిర్మాణం చేపట్టగా, మధ్యలో అటవీ భూమి ఉండగా అభ్యంతరాలతో పనులు నిలిచిపోయాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దృష్టికి సమస్యను తీసుకెళ్లగా ఆయన ఆదేశాలతో జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, పంచాయతీరాజ్ శాఖ ఈఈ మహేష్ గురువారం పరిశీలించారు.
రెండు శాఖల ఆధ్వర్యాన సర్వే నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరెడ్డి, ఏఈ నరేష్, కాంగ్రెస్ నాయకుడు అనుమోలు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కాగా, అటవీ ప్రాంతంలో మరింత పచ్చదనం పెంచేలా కృషి చేస్తున్నట్లు డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ తెలిపారు. ఇందులో భాగంగా గురువారం జమలాపురంలోని అటవీ ప్రాంతంలో 500 సీడ్ బాల్స్ విసరగా ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవకుడు ఆదిత్య శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడిని కలిసిన జిల్లా నాయకులు
ఖమ్మంమయూరిసెంటర్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను జిల్లా కాంగ్రెస్ నేతలు గురువారం ఢిల్లీలో కలిశారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళల కార్పొరేషన్ల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు ఖర్గేను కలిసిన వారిలో ఉన్నారు.
వీ.వీ.పాలెం పీఏసీఎస్‌లో సీఈఓలు, లెక్చరర్లు
రఘునాథపాలెం: జిల్లాలోని వివిధ పీఏసీఎస్‌ల సీఈఓలు, టెస్కాబ్ లెక్చరర్లు ఐదు రోజుల శిక్షణలో భాగంగా గురువారం మండలంలోని వీ.వీ.పాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సొసైటీ ఉపాధ్యక్షుడు రావెళ్ల శ్రీనివాసరావు, సీఈఓ తిరుపతిరావు సంఘం ద్వారా అమలవుతున్న కార్యకలాపాలు, అభివృద్ధిని వివరించారు. సాంకేతికతను వినియోగించుకంఉటూ సంఘం అభివృద్ధి వేగంగా జరిగేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 35 పీఏసీ ఎస్‌ల సీఈఓలు, టెస్కాబ్ లెక్చరర్లు విజయకుమార్‌రెడ్డి, సంపత్‌కుమార్ పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ.. ఆరోగ్యం
ఖమ్మంవ్యవసాయం: సైక్లింగ్ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యవంతమైన జీవనం సొంతమవుతుందని జిల్లా అటవీ అధికారి(డీఎఫ్‌ఓ) సిద్దార్థ్ విక్రమ్‌సింగ్ తెలిపారు. ఖమ్మం సైక్లింగ్ క్లబ్ లోగోను గురువారం ఆయన తన కార్యాలయంలో ఆవిష్కరించడంతో పాటు మొక్క నాటాక మాట్లాడారు. సైక్లింగ్ ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చనే అంశాన్ని ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ విషయమై సైక్లింగ్ క్లబ్ కృషి చేయాలని డీఎఫ్‌ఓ తెలిపారు.
ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
చింతకాని: జిలాల్లో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి, ఎవరైనా డీలర్లు కృత్రిమ కొరత సృష్టించాలన ప్రయత్నిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య హెచ్చరించారు. చింతకాని మండలం నాగులవంచ, లచ్చగూడెం, నాగిలిగొండ, పాతర్లపాడుల్లో సొసైటీలు, ఎరువుల దుకాణా లను గురువారం తనిఖీ చేశాక ఆయన మాట్లాడారు. జిల్లా నుంచి మండలానికి రావాల్సిన ఎరువుల కోటా పంపిస్తున్నందున రైతులను ఇబ్బంది పెట్టకుండా విక్రయిస్తూ రికార్డులు పక్కాగా నిర్వహించాలని సూచించారు. సరిప డా నిల్వలు ఉన్నందున రైతులు కూడా ఆందోళనకు గురికావొద్దని డీఏఓ సూచించారు. ఏఓ మానస, నాగులవంచ సొసైటీ సీఈఓ యాలముడి శ్రీనివాసరావు, ఏఈఓలు పాల్గొన్నారు.

పీఆర్ రోడ్ల పరిధిలో అటవీ భూమి సర్వే