
పొంగి పొర్లిన వాగులు
రఘునాథపాలెం/కామేపల్లి: రఘునాథపాలెం మండలం పాపటపల్లి – వీఆర్.బంజర మధ్య గురువారం మధ్యాహ్నం బుగ్గ వాగుకు వరద పోటెత్తింది. రహదారిపైకి రెండు అడుగుల మేర నీరు చేరడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లెందు వైపు కురిసిన భారీ వర్షాలతో వాగులోకి వరద చేరినట్లు తెలుస్తుండగా, అధికారులు రెండు వైపులా ట్రాక్టర్లు ఏర్పాటుచేసి ఎవరూ వెళ్లకుండా పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. ఎంపీడీఓ అశోక్‌కుమార్, ఆర్‌ఐ వహీద్, గ్రామ కార్యదర్శులు నాగరాజు, హిమబిందు, పోలీసులు పర్యవేక్షించారు. అలాగే, కామేపల్లి మండలంలోని పొన్నేకల్ బుగ్గవాగు సైతం ఉధృతంగా ప్రవహించింది. బ్రిడ్జి మీదుగా ప్రవాహం ఉండడంతో లింగాల – డోర్నకల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో ఎవరూ వెళ్లకుండా తహసీల్ధార్ సుధాకర్, ఎంపీడీఓ రవీందర్ ఆధ్వర్యాన ట్రాక్టర్లు ఏర్పాటుచేయించారు.
●కారేపల్లి: కారేపల్లిలోని నల్లవాగు పొంగి పొర్లడంతో దీని పరిధిలోని పెద్ద చెరువు ఆయకట్టులో పొలాలు కొట్టుకుపోయాయి. పెద్ద చెరువు ఆయకట్టులో వారం రోజులుగా రైతులు వరి నాట్లు వేస్తుండగా, ప్రస్తుత వరదతో సుమారు వంద ఎకరాల్లో పొలాలు మునిగి నారు కొట్టుకపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాకపోకలకు అంతరాయం

పొంగి పొర్లిన వాగులు

పొంగి పొర్లిన వాగులు