డెంగీ హాట్‌స్పాట్లు.. | - | Sakshi
Sakshi News home page

డెంగీ హాట్‌స్పాట్లు..

Aug 7 2025 7:26 AM | Updated on Aug 7 2025 7:36 AM

డెంగీ హాట్‌స్పాట్లు..

డెంగీ హాట్‌స్పాట్లు..

● నాలుగేళ్ల కేసుల ఆధారంగా గుర్తింపు ● జిల్లాలో ఏటా 500కు పైగా కేసుల నమోదు ● ప్రభావిత గ్రామాల పీహెచ్‌సీలకు పరీక్ష కిట్లు ● కలెక్టర్‌ ఆదేశాలతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది

శాంపిళ్లతో నిర్ద్ధారణ

వర్షాకాలం సీజన్‌ ప్రారంభం కాగానే జిల్లా అంతటా దోమల మోత నిత్యకృత్యమైంది. దరిమిలా మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ వంటి విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇందులో డెంగీ బారిన పడిన కొందరు మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యాన వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన జ్వర సర్వే నిర్వహిస్తూ అనుమానితుల నుంచి రక్తనమూనాలు సేకరిస్తున్నారు. డెంగీ హాట్‌స్పాట్లుగా గుర్తించిన గ్రామాల్లో ఎక్కువ శాంపిల్స్‌ తీస్తున్నారు. 2023లో 29,637 శాంపిళ్లు తీయగా 520 డెంగీ పాజిటివ్‌ కేసులు తేలాయి. 2024లో 32,656 శాంపిల్స్‌ తీస్తే 529, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 4,895 శాంపిళ్లు సేకరించగా 42 డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా, 2023లో అత్యధికంగా సెప్టెంబర్‌, అక్టోబర్‌లో 330, 2024 జూలై, ఆగస్టులో 277, ఈ ఏడాది గత నెల, ఈ నెల కలిపి 38 పాజిటివ్‌ కేసులొచ్చాయి.

పారిశుద్ధ్య లోపంతోనే..

చిన్నపాటి వర్షం కురవగానే జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో నీరు నిలిచి పారిశుద్ధ్య సమస్య ఏర్పడుతోంది. దీనికి తోడు పంచాయతీలకు పాలకవర్గాలు లేక, ప్రశ్నించే వారు లేక డ్రెయినేజీలను సరిగ్గా శుభ్రం చేయక దోమల మోత మోగుతోంది. మున్సిపాలిటీలు, ఇతర పట్టణాల్లో అదే పరిస్థితి ఉండగా వర్షాకాలం వచ్చిందంటే విష జ్వరాలతో ఇబ్బంది పడే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమాలు ప్రతీ వారం నిర్వహించాల్సి ఉన్నా కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతోంది.

ఆ గ్రామాల్లో తీవ్రత

గత నాలుగేళ్ల డెంగీ కేసుల ఆధారంగా జిల్లాలో 82గ్రామాలను హాట్‌స్పాట్లుగా నమోదు చేశారు. ఏటా 500కు పైగా డెంగీ కేసులు నమోదవుతుండగా సగటున 200కు పైగా కేసులు ఈ గ్రామాల్లో వస్తున్నాయి. తిరుమలాయపాలెం మండలంలోని జల్లేపల్లి, పాతర్లపాడు, అజ్మీరాతండా, తిరుమలాయపాలెం, తిప్పారెడ్డిగూడెం, దమ్మాయిగూడెం, కొణిజర్ల మండలంలోని పెద్దమునగాల, పల్లిపాడు, గోపవరం, నేలకొండపల్లి మండలంలోని నేలకొండపల్లి, రాయగూడెం, బోదులబండ, గువ్వలగూడెం, ఖమ్మంరూరల్‌ మండలంలోని గుర్రాలపాడు, గుదిమళ్ల, రామన్నపేట, వైరా మండలంలోని వైరా, బోనకల్‌ మండలంలోని తూటికుంట్ల, ముదిగొండ మండలంలోని బాణాపురం, వల్లభి, రఘునాథపాలెం మండలంలోని వీవీ.పాలెం, రఘునాథపాలెం, ఖమ్మంఅర్బన్‌ మండలంలోని బాలపేట, వేంసూరు మండలంలోని కందుకూరు, సత్తుపల్లి మండలలోని గంగారం, తల్లాడ మండలంలోని అన్నారుగూడెం, కల్లూరు ఈ జాబితాలో ఉన్నాయి.

డెంగీ నియంత్రణలోనే ఉంది..

జిల్లాలో డెంగీ నియంత్రణలో ఉంది. కేసులపై అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులను ఆదేశించాం. జ్వర లక్షణాలు ఉంటే పరీక్ష చేయించి తగ్గే వరకూ పర్యవేక్షించాలని సూచించాం. పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో డెంగీ కిట్లు, మందులు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలపై మరింత శ్రద్ధ వహిస్తున్నాం. ఎవరికై నా జ్వరం ఉంటే సమీప పీహెచ్‌సీలో పరీక్ష చేయించుకోవాలి.

– అనుదీప్‌ దురిశెట్టి, కలెక్టర్‌

హాట్‌స్పాట్లు గుర్తించిన గ్రామాల్లో నమోదైన డెంగీ కేసులు, కొన్ని పీహెచ్‌సీల వారీగా గ్రామాలు

సంవత్సరం కేసులు పీహెచ్‌సీ హాట్‌స్పాట్‌

గ్రామాలు

2021 195 మంచుకొండ 10

2022 369 ఎం.వీ.పాలెం 08

2023 162 లంకాసాగర్‌ 08

2024 175 తిరుమలాయపాలెం 06

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement