
ఏటీసీ కోర్సులతో యువతకు ఉపాధి
ఖమ్మం సహకారనగర్: అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో ప్రవేశపెట్టిన కోర్సులతో యువతకు ఉపాధి భరోసా లభిస్తుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ మేరకు నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖమ్మం టేకులపల్లిలోని ఐటీఐని ఏటీసీగా అప్‌గ్రేడ్ చేసిన నేపథ్యాన కలెక్టర్ బుధవారం పరిశీలించారు. వివిధ కోర్సుల బోధనకు సమకూర్చిన యంత్రాల వివరాలు తెలుసుకున్న ఆయన పదో తరగతి అర్హత ఉన్న ఎక్కువ మంది చేరేలా అవగాహన కల్పించాలని అధ్యాపకులకు సూచించారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
●ఖమ్మం స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 45 పతకాలతో ఓవరాల్ చాంపియన్‌షిప్ దక్కించుకున్నారు. ఇందులో అథ్లెటిక్స్ అకాడమీతో పాటు ఇతర క్రీడాకారులు ఉండగా కలెక్టర్ అనుదీప్ బుధవారం అభినందించి, అకాడమీ కోచ్ ఎం.డీ.గౌస్‌ను సన్మానించారు. డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు వెంకటేశ్వర్లు, ఎం.డీ.షఫీక్ అహ్మద్ పాల్గొన్నారు.
●ఖమ్మంవ్యవసాయం: మూగజీవాల ఆరోగ్యంపై పశు వైద్యులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. పశువులకు సకాలంలో వైద్యం అందిస్తూ, మందుల కొరత రాకుండా చూసుకోవాలని తెలిపారు. ఖమ్మం రాపర్తినగర్‌లోని జిల్లా పశు వైద్యశాలను తనిఖీ చేసిన కలెక్టర్ చికిత్సకు ఉన్న సౌకర్యాలు, మందుల లభ్యతపై ఆరాతీయడమే కాక అభివృద్ది పనులను పరిశీలించారు. జిల్లా పశువైద్యశాల సహాయ సంచాలకులు వి.శ్రీనివాసరావు, డాక్టర్ కె.కిషోర్ ఉన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి