
మెరుగైన పనితీరుతో విద్యార్థులకు లబ్ధి
ఖమ్మం సహకారనగర్/కూసుమంచి: విద్యాశాఖ ఉద్యోగుల పనితీరు మెరుగ్గా ఉంటే విద్యార్థులకు బోధన, సౌకర్యాల్లో లోపాలు ఎదురుకావని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ(సైట్) డైరెక్టర్, జిల్లా పరిశీలకురాలు ఎస్.విజయలక్ష్మీబాయి తెలిపారు. జిల్లాలోని కూసుమంచి కేజీబీవీ, భవిత కేంద్రం, ఖమ్మంలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లను బుధవారం ఆమె తనిఖీ చేశారు. అనంతరం రోటరీనగర్ హైస్కూల్‌లో డీఈఓ నాగపద్మజతో కలిసి విద్యాశాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి ఫలి తాల పెంపునకు ఇప్పటినుంచే ప్రణాళికాయుతంగా ముందుకు సాగాలని సూచించారు. ఈసమావేశంలో ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉద్యోగులు పాల్గొన్నారు. కాగా, కూసుమంచి కేజీబీవీని సీఎంఓ రాజశేఖర్‌తో కలిసి తనిఖీ చేసిన విజయలక్ష్మి పరిసరాలు, వంటశాలను పరిశీలించడమే కాక విద్యార్థులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. ఇన్‌చార్జి ఎస్‌ఓ రాజేశ్వరికి సూచనలు చేశారు.