విద్యాశాఖ ఏఎంఓగా రాజశేఖర్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యాశాఖ ఏఎంఓగా రాజశేఖర్‌

Aug 7 2025 7:26 AM | Updated on Aug 7 2025 7:30 AM

విద్యాశాఖ ఏఎంఓగా రాజశేఖర్‌

విద్యాశాఖ ఏఎంఓగా రాజశేఖర్‌

ఖమ్మం సహకారనగర్‌: విద్యాశాఖలో అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌(ఏఎంఓ)గా వాసిరెడ్డి రాజశేఖర్‌ నియమితులయ్యారు. ఆయన నియామకంపై డీఈఓ కె.నాగపద్మజ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం చింతకాని మండలం తుమ్మలపల్లి హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న రాజేశేఖర్‌ ఏఎంఓగా గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

హార్వెస్ట్‌, త్రివేణి

జట్ల విజయం

ఖమ్మం స్పోర్ట్‌: రాజీవ్‌గాంధీ మెమోరియాల్‌ రోలింగ్‌ క్రికెట్‌ ట్రోఫీ పోటీలు బుధవారం రెండో రోజుకు చేరాయి. అండర్‌–12 బాలుర విభాగంలో ఖమ్మంకు చెందిన హార్వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌, త్రివేణి పాఠశాలల జట్లు ముందంజలో నిలిచా యి. తొలి మ్యాచ్‌లో త్రివేణి – శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌ జట్లు పోటీ పడగా త్రివేణి, రెండో మ్యాచ్‌ హార్వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌ – షైన్‌ ఇండియా పాఠశాలల మధ్య జరగగా హార్వెస్ట్‌ జట్టు విజయం సాధించింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లుగా రిత్విక్‌, అభిషేక్‌ ఎంపిక కాగా, తొలుత మ్యాచ్‌లను తుమ్మల యుగంధర్‌, మార్కెట్‌ చైర్మన్‌ యార్లగడ్డ హన్మంతరావు ప్రారంభించారు. టోర్నీ నిర్వాహకుడు ఎం.డీ.మతిన్‌తో పాటు కొత్త సీతారాములు, బాణాల లక్ష్మణ్‌, మిక్కిలినేని నరేందర్‌, ఫరీద్‌ ఖాద్రీ, ఆశ్రిఫ్‌ పాల్గొన్నారు.

వెబ్‌సైట్‌లో

ఎంపిక జాబితా

ఖమ్మంవైద్యవిభాగం: జాతీయ ఆరోగ్య మిషన్‌ విభాగంలో తాత్కాలిక, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో సపోర్ట్‌ ఇంజనీర్లను నియమించనున్నారు. ఇందుకు సంబంధించి ఎంపిక జాబితాను https:// khammam. telangana. gov. in/ వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు డీఎంహెచ్‌ఓ బి.కళా వతిబాయి తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 7న ఉదయం 10–30 నుంచి సాయంత్రం 5గంటల్లోగా తగిన ధ్రువపత్రాలతో డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

‘విద్యానిధి’ దరఖాస్తు గడువు పొడిగింపు

ఖమ్మంమయూరిసెంటర్‌: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన షెడ్యూల్‌ కులాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం దరఖాస్తుకు గడువు పొడిగించారు. ఈ విషయాన్ని షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకుడు కె.సత్యనారాయణ తెలిపారు. ఈ పథకం ద్వారా పది దేశాల్లో చదివేందుకు అవకాశం ఉండగా, అర్హత కలిగిన వారు రూ.20లక్షల ఆర్థిక సాయం కోసం ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకున్నాక ప్రతులను తమ కార్యాలయంలో అందజేయాలని డీడీ తెలిపారు.

నేటి నుంచి తెలుగు రాష్ట్రాల స్థాయి నాటికల పోటీలు

ఖమ్మంగాంధీచౌక్‌: తెలుగు రాష్ట్రాల స్థాయి నాటికల పోటీలు గురువారం ఖమ్మంలో ప్రారంభం కానున్నాయి. నెలనెలా వెన్నెల 8వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే ఈ పోటీలకు ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రం సిద్ధమైంది. ఉభయ రాష్ట్రాల్లో పేరున్న రంగస్థల నటులు 150మందికి పైగా పోటీల్లో పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. గురువారం నుంచి ఆదివారం వరకు పోటీలు జరగనుండగా, సమాజ చైతన్యం, మూఢ నమ్మకాల నిర్మూలన తదితర అంశాలపై నాటిక ప్రదర్శనలు ఉంటాయని నెలనెలా వెన్నెల బృందం బాధ్యులు అన్నాబత్తుల సుబ్రహ్మణ్య కుమార్‌, మోటమర్రి జగన్మోహన్‌రావు వేముల సదానంద్‌ తెలిపారు.

చదువు మానేసిన వారికి వరంలా ఓపెన్‌ స్కూల్‌

కారేపల్లి: వివిధ కారణాలతో మధ్యలో చదువు మానేసిన వారే కాక స్వయం సహాయక సంఘాల సభ్యులు ఓపెన్‌స్కూల్‌ ద్వారా చదువు కొనసాగించాలని ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ మద్దినేని పాపారావు సూచించారు. కారేపల్లి ఐకే పీ కార్యాలయంలో బుధవారం ఆయన ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లుతో కలిసి ఐకేపీ సీసీలు, గ్రామ దీపికలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కో ఆర్డినేటర్‌ మాట్లాడుతూ చదువుకోవాలనే ఆకాంక్ష ఉన్న సభ్యులు పదో తరగతి, ఇంటర్‌ చదివే అవకాశముందని తెలిపారు. ఈనెల 18వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశమున్నందున సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. ఐకేపీ సీసీలు అనిల్‌కుమార్‌, పుష్పకుమారి, సోందు, గౌసియా బేగం, విజయలక్ష్మి, అకౌంటెంట్‌ నాగలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement