
దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
●ఒకరు మృతి.. మరో ఐదుగురికి గాయాలు
జూలూరుపాడు: కుటుంబీకులంతా దైవదర్శనం చేసుకున్నా రు. బంధువులను కలిసి, మరో బంధువు నిశ్చితార్థంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. కానీ, వారి ప్రయాణం గమ్యం చేరు కోలేదు. వీరు వెళ్తున్న మారుతి వ్యాన్‌ను లారీఢీకొట్టడంతో ఒకరుమృతిచెందగా మరో ఐదుగురికిగాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా కొణి జర్ల మండలం గద్దలగూడెం గ్రామానికి చెందిన కె.చెన్నారావు (33) ఖమ్మంటౌన్–3 విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సబ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డు నుంచి బుధవారం తొమ్మిది మంది వ్యాన్‌లో ఖమ్మం వెళ్లగా చెన్నారావు డ్రైవింగ్ చేశాడు. ఖమ్మంలో దైవదర్శనం అనంతరం బంధువులను కలిసి చుంచుపల్లి బయలుదేరారు. హౌసింగ్ బోర్డులో బుధవారం సాయంత్రం చెన్నారావు మేనకోడలు నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా జూలూరుపాడు మండలం పడమటనర్సాపురం వద్ద వీరి వ్యాన్ ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో చెన్నా రావుకు తీవ్రగాయాలు కాగా సీపీఆర్ చేయడంతో పాటు తీవ్రంగా గాయపడిన ఆయన భార్య భార్గవి, తల్లిసావిత్రి, మరో ముగ్గురు క్షతగాత్రులను కొత్తగూ డెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే చెన్నారావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మిగతా వారికి చికిత్స కొనసాగుతోంది.
●ఖమ్మంవ్యవసాయం: విద్యుత్‌శాఖ ఉద్యోగి ఆర్.చెన్నారావు(34) మృతిపై శాఖ ఉద్యోగులు సంతాపం తెలిపారు. జూలూరుపాడు సమీపాన జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందాడనే సమాచారంతో తెలి యగా అధికారులు, ఉద్యోగులు నివాళులర్పించారు.
ఇద్దరి మృతదేహాలకు
అంత్యక్రియలు
ఖమ్మంఅర్బన్: వివిధ ప్రాంతాల్లో మృతిచెందిన ఇద్దరి మృతదేహాలకు అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యాన అంత్యక్రియలు నిర్వహించారు. వైరాకు చెందిన కార్తీక్(40) ఇటీవల మృతిచెందగా ఆయన తల్లి వృద్ధురాలు కావడంతో పోలీసులు అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు. దీంతో అంబులెన్స్‌లో మృతదేహాన్ని ఖమ్మం బల్లేపల్లిలోని వైకుంఠధామానికి తీసుకొచ్చిఅంత్యక్రియలు పూర్తి చేశారు.అలాగే, మామిళ్లగూడెం వద్ద రైలు కిందపడి మృతి చెందిన గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహానికి కూడాపోలీసుల సూచనలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.
పురుగుల మందు తాగి ఆత్మహత్య
ఖమ్మంరూరల్: మండలంలోని రెడ్డిపల్లికి చెందిన అనుముల లచ్చిరెడ్డి(49) పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పుట్టుకతో మరుగుజ్జుగా ఉన్న లచ్చిరెడ్డి వివాహం జరిగాక కొన్నాళ్లకు భార్య వెళ్లిపోయింది. అప్పటి నుండి అదే గ్రామంలోని సోదరి ఇంట్లో ఉంటూ పంప్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి ఎవరూ లేని సమయాన పురుగుల మందు తాగగా, కాసేపటికి వచ్చిన కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జీవితంపై విరక్తి, ఒంటరితనం భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు అందిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఖమ్మం రూరల్ సీఐ ముష్క రాజు తెలిపారు.
కడుపునొప్పి తాళలేక..
రఘునాథపాలెం: కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మండలంలోని కొర్లబోడు తండాకు చెందిన గుగులోతు జ్యోతి(38) కొద్దిరోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుండడంతో ఈనెల 1న ఎలుకల మందు తీసుకుంది. ఆమెకు ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్‌కి తరలించగా మృతి చెందింది. ఆమె సోదరుడు సతీష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.